Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంలో నిజాలు బయటకు రావాలి: పొన్నవోలు సుధాకర్ రెడ్డి
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:06 PM
తిరుమల లడ్డూ వివాదంపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. లడ్డూ కల్తీకి కారణమైన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదని.. . తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంలో నిజాలు బయటకు రావాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. కోట్లాదిమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడగట్టిందని ఆరోపించారు. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని. కోట్లాదిమంది భక్తుల విషయమని చెప్పారు. ఈ ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తుచేశారు.
ALSO READ: Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంను ఆశ్రయించిన వైవీ...
తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నామని... కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటకు రావాలని అన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ALSO READ: Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్’కు ఏపీ సర్కార్ ఆదేశం
విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. లడ్డూ కల్తీకి కారణమైన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదని.. . తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఆర్ ఫుడ్ ట్యాంకర్లు సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని టీటీడీ ప్రస్తుత ఈవో శ్యామలరావు తెలిపారని అన్నారు.
ALSO READ: Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..
కల్తీ జరిగింది అని గుర్తించిన 4 ట్యాంకర్లను వెనక్కు పంపించినట్లు ఆయనే చెప్పారని అన్నారు.. ప్రతి ట్యాంకర్ నుంచి మూడు వేర్వేరు శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఆ మూడు రిపోర్టుల్లో కల్తీ జరగలేదని నిర్ధారణ జరిగిన తర్వాతే ట్యాంకర్‌ను లోపలకు అనుమతించారని స్పష్టం చేశారు. తమ దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదని టీటీడీ అధికారులు చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. శర్మిష్ట అనే అధికారి టీటీడీకి వచ్చే నెయ్యిని ఎలా పరీశీలించారో చెప్పాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..
AP News: మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్
YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 23 , 2024 | 03:22 PM