Share News

వైసీపీ రంగులు మార్చేదెప్పుడు?

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:03 AM

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 14 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాలకు, వాటర్‌ ట్యాంకులకు వైసీపీ రంగులు మాత్రం మార్చడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

వైసీపీ రంగులు మార్చేదెప్పుడు?
గుడిపాల మండలం బసవాపల్లెలోని పంచాయతీ కార్యాలయం

గుడిపాల/పెనుమూరు, మార్చి 30: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 14 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాలకు, వాటర్‌ ట్యాంకులకు వైసీపీ రంగులు మాత్రం మార్చడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గుడిపాల మండలంలోని బసవాపల్లె పంచాయతీ కార్యాలయానికి ముందు భాగంగా తెల్ల రంగు వేసి, వెనుక భాగంలో వైసీపీ రంగులు అలాగే ఉంచేశారు. అలాగే పెనుమూరు మండలంలో చార్వాగానిపల్లి సచివాలయ పరిధిలోని సీఎస్‌ అగ్రహారంలో నూతనంగా నిర్మించిన వాటర్‌ ట్యాంకుకు, కలికిరి పంచాయతీ గొల్లపల్లి, మొరవకండ్రిగ పాఠశాల వద్ద కూడా వైసీపీ రంగులతో వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి.

Updated Date - Mar 31 , 2024 | 01:03 AM