Share News

ఉత్తరాంధ్ర అధికారులతో సీఎం సమీక్ష

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:16 AM

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో...

ఉత్తరాంధ్ర అధికారులతో సీఎం సమీక్ష

అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి, పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల తర్వాత పంట నష్టం వివరాలు సేకరించి, రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను సీఎంవో అధికారులు సీఎంకు వివరించారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Updated Date - Dec 22 , 2024 | 05:17 AM