Share News

Dr. Undavalli Sridevi : మాదిగల అభివృద్ధికి కలిసి కృషి చేద్దాం

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:37 AM

మాదిగల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్లకు.. చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి సూచించారు.

Dr. Undavalli Sridevi  : మాదిగల అభివృద్ధికి కలిసి కృషి చేద్దాం

  • వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభిస్తాం: ఉండవల్లి శ్రీదేవి

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మాదిగల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్లకు.. చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి సూచించారు. గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో కార్పొరేషన్‌ డైరెక్టర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం తప్ప ఎస్సీల అభివృద్ధికి వినియోగించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి నూరుశాతం కట్టుబడి ఉందని వారి అభ్యున్నతికి సీఎం చంద్రబాబు సహకారంతో కృషి చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్‌కు జగన్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Dec 06 , 2024 | 05:38 AM