Share News

ముగ్గురి హత్య కేసులో వేట్లపాలెంలో 12 మంది అరెస్ట్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:47 AM

సామర్లకోట, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వేట్లపాలెంలో ఇంటి నిర్మాణంలో 2 కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం కత్తులు వంటి మారణా యుధాలతో ఆదివారం రాత్రి దాడులకు పాల్పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను హత్య చేసి మరో ఏడుగురిని గాయపరిచిన 12 మంది వ్యక్తులను బుధవారం సాయంత్రం సామర్లకోటలో అరెస్ట్‌ చేసినట్టు సామర్లకోటలో బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో పెద్దాపు

ముగ్గురి హత్య కేసులో వేట్లపాలెంలో 12 మంది అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐలు

అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు

మారణాయుధాలు, ఆటో స్వాధీనం

పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడి

సామర్లకోట, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వేట్లపాలెంలో ఇంటి నిర్మాణంలో 2 కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం కత్తులు వంటి మారణా యుధాలతో ఆదివారం రాత్రి దాడులకు పాల్పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను హత్య చేసి మరో ఏడుగురిని గాయపరిచిన 12 మంది వ్యక్తులను బుధవారం సాయంత్రం సామర్లకోటలో అరెస్ట్‌ చేసినట్టు సామర్లకోటలో బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. వివరాల ప్రకారం... కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివారు దళితచెరువు వద్ద కార్ధాల పండు అనే వ్యక్తి ఇంటినిర్మాణంలో భాగంగా శ్లాబ్‌ పనులు చేస్తుండగా అదే గ్రామా నికి చెందిన బచ్చల మోషే, బచ్చల జకరయ్య, బచ్చల బిల్లప్ప అనే బుల్లప్పి, బచ్చల దొరయ్య, బచ్చల రాము, బచ్చల రాజ్‌కుమార్‌, బచ్చల చంద్రరావు, గుల్ల సన్నీ, శీకోటి రాజేంద్రప్రసాద్‌, బచ్చల గోపీ, బచ్చల గవరయ్య, బచ్చల రాజు, గుడాల సునీల్‌, బచ్చల సూర్యాకాంతం, బచ్చల భాగ్యవతి, ద్రోణం సత్యవేణి మరికొందరు వ్యక్తులతో కలిసి తొలుత ఇంటి నిర్మాణదారుడితో ఘర్షణలకు సిద్ధపడ్డారు. మందుగా అనుకున్న వ్యూహం మేరకు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కార్ధాల కుటుంబాలకు చెందిన వ్యక్తుల పై దాడులకు దిగి నరకడంతో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అరెస్టు చేసినవారిలో బచ్చల జకరయ్య, బచ్చల మోషే, బచ్చల బిల్లప్పన్న అనే బుల్పప్పి, బచ్చల దొరయ్య అనే దొరబాబు, బచ్చల రాము, బచ్చల గోపీ, బచ్చల గవరయ్య అనే చంటి, బచ్చల రాజు, బచ్చల సూర్యా కాంతం, బచ్చల భాగ్య వతి, ద్రోణం సత్యవేణి, కొత్తపల్లి చిన్నయ్యలు ఉన్నారు. హత్యకు ఉప యోగించిన 5 మార ణాయుధాలు, 3 కర్రల తో పాటు దాడులకు వినియోగించిన ఆటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. రెండు కు టుంబాల మధ్య ఆధి పత్య పోరే ముగ్గురి హత్యలకు దారి తీసిం దని డీఎస్పీ చెప్పారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు అడ్మిన్‌ ఎస్పీ సూచ నలతో పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో సామ ర్లకోట సీఐ, పెద్దాపురం క్రైం సీఐ తదితర ఎస్‌ఐ లతో కలిసి వేట్లపాలెం జీవీకె విద్యుదుత్పత్తి కేంద్రం రోడ్డులో నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో మరికొందరిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని, కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగు తుందని డీఎస్పీ శ్రీహరి రాజు చెప్పారు. కాగా 12 మంది వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు పోలీ సులు పేర్కొన్నప్పటికీ విలేకరుల సమావేశంలో అరెస్ట్‌ చేసినవారినెవ్వరినీ పాత్రికేయుల సమావేశంలో హాజరుపర్చకపోవడం గమనార్హం.

Updated Date - Dec 19 , 2024 | 12:47 AM