Share News

‘వితంతు పింఛన్‌ ఇప్పించండి మహాప్రభో’

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:04 AM

తమకు వితంతు పింఛన్‌ ఇప్పించండి మహా ప్రభో అంటూ పాశర్లపూడి గ్రామానికి చెం దిన ఎనిమిది మంది వితంతు మహిళలు వేడుకుంటున్నారు.

‘వితంతు పింఛన్‌ ఇప్పించండి మహాప్రభో’

మామిడికుదరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): తమకు వితంతు పింఛన్‌ ఇప్పించండి మహా ప్రభో అంటూ పాశర్లపూడి గ్రామానికి చెం దిన ఎనిమిది మంది వితంతు మహిళలు వేడుకుంటున్నారు. తాము పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారు లు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త 2007లో మరణించినప్ప టికి ఇప్పటివరకు తనకు పింఛన్‌ మంజూ రు కాలేదని గ్రామానికి చెందిన ఈతకోట వెంకటలక్ష్మి వాపోయింది. కారణాలు చెప్ప కుండా పింఛన్‌ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పింఛన్‌ కోసం సోమవారం కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించినట్లు ఆమె తెలిపింది. కార్యక్రమంలో మేడా పైడమ్మ, అంకాని కాసులమ్మ, మంద పాటి సత్యవతి, నేదునూరి ప్రభావతి, ఈత కోట వెంకటలక్ష్మి, అంగాని నాగమణి, దిగు మర్తి పెద్ధింట్లు, పిల్లి బేబిసరస్వతి ఉన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 01:04 AM