ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: లెక్క తప్పిందా.. టెన్షన్‌లో నేతలు..

ABN, Publish Date - May 20 , 2024 | 09:22 PM

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్‌పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

YSRCP and TDP, Janasena, BJP

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్‌పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నారు. ఏ గ్రామంలో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి.. ఏ గ్రామంలో వ్యతిరేకంగా పడ్డాయో తెలుసుకున్నారట. ఓవైపు వైసీపీ అధినేత జగన్ తమకు మెజార్టీ సీట్లు వస్తాయని 151 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధినేత మాటలపై నమ్మకంతో జూన్‌9న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఓవైపు అధినేత మాటలకు, మరోవైపు క్షేత్రస్థాయి నుంచి సేకరించిన రిపోర్టుకు పొంతన లేకపోవడంతో వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారట. ఉత్తరాంధ్రాలో విజయనగరం మినహా ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖలో ఎన్డీయే కూటమి స్వీప్ చేసే అవకాశం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మెజార్టీ సీట్లు కూటమికి వస్తాయని వైసీపీ నేతలే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 151 సీట్లు వస్తాయంటూ జగన్ ఏ ధీమాతో ప్రకటించారో పార్టీ శ్రేణులకు అర్థం కావడంలేదట.

AP News: ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: సీపీ


లెక్కలు తారుమారు..

ఎన్నికల పోలింగ్‌కు ముందు ఊహించినదానికి.. పోలింగ్ తర్వాత వినిపిస్తున్న ప్రజల నాడికి తేడా ఉండటంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. వాస్తవానికి పేద, మధ్య తరగతి మహిళలు, వృద్ధుల ఓట్లు ఏకపక్షంగా తమకు పడతాయని వైసీపీ నాయకులు ఆలోచించారట. అయితే పోలింగ్ సరళి, ఓటింగ్ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటుంటే మాత్రం మహిళల ఓట్లు మాత్రం ఏకపక్షంగా ఒకే పార్టీకి పడలేదని.. కూటమికి, వైసీపీకి చెరి సమానంగా మహిళల ఓట్లు చీలిపోయినట్లు తెలుస్తోంది. వృద్ధుల్లో ఎక్కువ శాతం ఓట్లు పడినప్పటికీ.. యువత, ఉద్యోగస్తుల ఓట్లు అధికంగా ఎన్డీయే కూటమికి పడ్డాయని వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు సేకరించిన సమాచారంలో తేలిందట. దీంతో గెలుపు అవకాశాలు ఎన్డీయే కూటమికే ఉన్నట్లు గ్రామాల్లోనూ ప్రచారం జరుగుతోంది.


అతి విశ్వాసమే దెబ్బతీసిందా..

అతివిశ్వాసమే తమను దెబ్బతీసిందా అనే చర్చ వైసీపీలో జరుగుతోందట. కొన్ని చోట్ల పోల్‌మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయకపోవడం తమకు మైనస్‌గా మారిందని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. గెలుస్తామనే ధీమాతో కొన్నిచోట్ల స్థానిక నేతలు డబ్బులు అనుకున్నవిధంగా పంచలేదని సొంత పార్టీలోనే డిస్కషన్ జరుగుతోంది. దీంతో తమకు గెలుపు అవకాశాలు లేకుండా పోయాయనే చర్చ నడుస్తోంది. అయితే ఏపీ ప్రజలు ఏ విధంగా ఆలోచించారు.. వారి ఫైనల్ తీర్పు ఎలా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.


AP Poll Violence: ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 20 , 2024 | 09:22 PM

Advertising
Advertising