AP Elections: నోట్లు తీసుకుంటాం.. ఓట్లు వేయం.. సర్వే సంస్థలకు షాకిస్తున్న ఓటర్లు..
ABN, Publish Date - May 01 , 2024 | 01:11 PM
ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట.
ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట. ఓటర్ల సొంతగ్రామాలకు వెళ్లి.. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి గెలిచే ఛాన్స్ ఉందంటే ఎవరూ బయటపడటం లేదట. వైసీపీ పరిస్థితి ఎలా ఉందన్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదట.. కానీ అదే ఓటరు ఏదైనా పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పడుు మాత్రం మీ దగ్గర ఎవరికి అనుకూలంగా ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని అడిగినప్పుడు మాత్రం సరైన సమాధానం వస్తుందట. దీంతో సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్ల నాడి పట్టుకోవడం కష్టంగా మారిందనే చర్చ జరుగుతోంది.
కొంతమంది ఓటర్లు స్థానిక నాయకులకు భయపడి అసలు విషయం బయటపెట్టడం లేదట. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది బహిరంగ రహస్యం. వైసీపీ నాయకుల అరాచకాలకు విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీపై ఎంతో వ్యతిరేకతతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని ముందే బయటపెడితే తాము ఈ నెలరోజుల్లో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని, తమను మరింతగా వేధిస్తరానే ఆలోచనతోనే ఎవరికి ఓటు వేసేది బయటపడటం లేదనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
YSRCP: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే టార్గెట్..
నోట్లు పంచినా..!
ఈసారి ఎన్నికల్లో నోట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలోనూ క్లారిటీ కనిపించడం లేదు. సాధారణంగా ఏ పార్టీ నాయకుడు ఎక్కువ డబ్బులిస్తే అటువైపే ఓటరు మొగ్గుచూపుతారనే అభిప్రాయం చాలామందిలో ఉండేది. ఈఎన్నికల్లో మాత్రం కొంచెం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఎవరూ డబ్బులిచ్చినా తీసుకుంటాం.. కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వాళ్లకే వేస్తామనే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో డబ్బులు తీసుకున్నాం.. మోసం చేయకూడదనే ఓ ఆలోచనతో సామాన్య వ్యక్తులు తమ ఓటు వేసేవారు. ఈసారి మాత్రం ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకులు నీతి,నిజాయితీగా ఉండటంలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు.. తాము ఎందుకు నోటు తీసుకుని ఓటు వేయాలనే రీతిలో ఆలోచినట్లు తెలుస్తోంది. నోట్ల పంపిణీలో అధికారపార్టీ ముందు ఉండగా.. ఓటర్లు మాత్రం ఎక్కువ శాతం కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నోట్లు తీసుకున్నా.. ఆ పార్టీకే ఓటు వేస్తామని ఎవరూ గ్యారంటీగా చెప్పడం లేదని కొందరు సర్వే సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
గతానికంటే భిన్నంగా..
రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఓటరు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదని, అభివృద్ధి, సంక్షేమం రెండూ అవసరమని ఎక్కువమంది ఓటర్లు భావిస్తున్నారట. అనేక సర్వేల్లోనూ ఇదే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదనే అసంతృప్తి ఎక్కువమందిలో కనిపిస్తోందట. అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వైసీపీకి ఓటు వేయబోమని ఎక్కువమంది ఓటర్లు చెబుతున్నారట. ఈనేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. మెజార్టీ మార్క్‌ను దాటే పార్టీ ఏదో తెలుసుకోవాలంటే దాదాపు మరో నెలరోజులు ఓపికపట్టాల్సిందే.
TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News
Updated Date - May 01 , 2024 | 01:11 PM