Nara Lokesh: గుడ్ న్యూస్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్..!!
ABN , Publish Date - Jul 16 , 2024 | 08:11 PM
పాత ఫీజు రీయింబర్స్ మెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
అమరావతి: పాత ఫీజు రీయింబర్స్ మెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ (Nara Lokesh) అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంగళవారం మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
లెక్చరర్ పోస్టుల భర్తీ..!!
‘డ్రగ్స్‌పై విద్యార్థులను చైతన్య పరిచేందుకు స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. న్యాయపర చిక్కులను తొలగించి త్వరగా పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రమేయం లేకుండా నియామకం జరగాలి. ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఇయర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్యాలండర్ రూపొందించాలి. నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలి అని’ అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
AP Cabinet Meet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం
తగ్గిన డిగ్రీ ప్రవేశాలు
‘గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ తగ్గాయి. అడ్మిషన్స్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అడ్మిషన్లను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలను డ్యాష్ బోర్డులో పొందుపర్చాలి. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబేడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం కాలేజీల ఎంపిక గురించి చర్చ జరిగింది అని’ మంత్రి నారా లోకేశ్ తేల్చి చెప్పారు. ఇదే కాక ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు అంశాలపై మంత్రి నారా లోకేశ్ సమీక్షించారు.
ఇవి కూడా చదవండి
అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం
For AP News and Telugu News