Share News

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Aug 27 , 2024 | 09:41 PM

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
YS Jagan

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. తన కుమార్తె పుట్టినరోజు నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్తున్నట్లు జగన్ కోర్టుకు తెలిపారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. మొబైల్ నెంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐ అధికారులకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్‌పోర్టు జారీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి రావడంతో జగన్ 20 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు.

TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు


ఈ ఏడాది రెండోసారి

ఈ ఏడాది జగన్ విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. మే17 నుంచి జూన్1 వరకు ఆయన విదేశాల్లో పర్యటించారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటించారు. మూడు నెలల పరిధిలో రెండోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఇటీవల కాలంలో జగన్ బెంగళూరులో సైతం ఎక్కువుగా ఉంటున్నారు. వారంలో మూడు రోజులు బెంగళూరులో ఉంటే.. మిగతా రోజులు తాడేపల్లిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. వాస్తవానికి 15రోజులకు పైగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసినప్పటికీ.. జగన్ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి


కేసు నేపథ్యంలో..

జగన్ ఎప్పుడు దేశం విడిచి వెళ్లాలన్నా తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. ఈ ఏడాది మేలో ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టు అనుమతితోనే వెళ్లారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండటంతో.. ముందస్తు సమాచారం, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. జగన్ న్యాయస్థానం అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మరోవైపు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సైతం విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి కోరారు. ఈనెల 30 కోర్టు విజయసాయిరెడ్డి పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.


AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 09:41 PM