Share News

వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా!

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:41 AM

వైసీపీ నాయకులు రెzచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్‌ అధికారుల వద్ద రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ‘నీవు దళితుడివి...నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.

వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా!
Borugadda Anil Kumar

అండగా మేముంటాం... దళితుడివి..

మంచి భవిష్యత్తు ఉంటుందంటే దూషించా

ఇప్పుడు పరామర్శకు ఒక్కడూ రాలేదు

తిట్టినవాళ్లను కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరతా

అప్రూవర్‌గా మారతా.. పోలీసుల వద్ద

కన్నీరుపెట్టుకున్న బోరుగడ్డ అనిల్‌

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు


గుంటూరు,అక్టోబరు 17: వైసీపీ నాయకులు రెచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్‌ అధికారుల వద్ద రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ‘నీవు దళితుడివి...నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.. టీడీపీని తిడితే మేం అండగా ఉంటాం...’ అని నాడు ప్రోత్సహించిన వారు.. నేడు ఒక్కడు కూడా పరామర్శకు రాలేదని వాపోయినట్టు సమాచారం. ‘‘ఆ రోజు అలా తిట్టడం తప్పే.. ఎవరినైతే సోషల్‌ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతాను. అప్రూవర్‌గా మారతాను’’ అని వేడుకొన్నట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు..


Ycplo.gif


రిమాండ్‌

అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను గురువారం పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా, 29వరకు రిమాండ్‌ విధించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని మేజిస్ట్రెట్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్‌ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్‌ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి తాము వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని తెలిపారు. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్‌ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్‌ పేర్కొన్నారు.


ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అనిల్‌పై చర్యలు

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేేస్త కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ‘‘అనిల్‌ కుమార్‌ తనకు తాను రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొంటున్నారు. దీనిపై అనేక వివాదాలు ఉన్నాయి. వర్డ్‌ అకాడమీ(యూకే) పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్‌ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్‌ జైలుకెళ్లారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్‌ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవారు. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అనిల్‌ను పోలీస్‌ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఎవరనైనా ఉన్నారా గుర్తించాల్సిఉంది’’ అని ఎస్పీ వివరించారు.

ఇది కూడా చదవండి:

వెంకట్రామిరెడ్డీ... దిగిపో

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 18 , 2024 | 08:53 AM