YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:48 PM
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: ప్రముఖ సినీహీరో ప్రభాస్‌తో రిలేషన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ మోహన్ రెడ్డి , ఆదానీలపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేశారు..
‘‘నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చూయించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాశారా. విచారణ ఎందుకు చేయలేదు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా. మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూయించి జగన్ సానుభూతి పొందాలని చూశారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు ...నాన్న పేరు సీబీఐ చార్జి షీట్‌లో పెడతారు.. తనపై దుష్ప్రచారం చేయిస్తారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అలా చేయొద్దు..
‘‘జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవొద్దు. ఇక మీదట ఏపీ నుంచి అదానీకి ప్రాజెక్ట్స్ ఇవ్వొద్దు. మోదీ అదానీ వేర్వేరు కాదు. మోదీ అదానికి రక్షణ కల్పిస్తున్నారు.అదానీ మోదీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉంది. అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది మోదీ అదానీల బంధం. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఇంత డబ్బులు సంపాదించడం ఎలా సాధ్యం. అదానీ వ్యవహారం మోదీకి , దేశానికి అవమానం. కాంగ్రెస్ అడిగే ఒక్క ప్రశ్నకు అయిన మోదీ సమాధానం చెప్పాలి. మోదీ అదానీనీ అమెరికాకు అప్పగిస్తారా. మోదీ అండతోనే దేశంలో ఇంత అవినీతి జరుగుతుంది. జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూఎస్‌ఏ గౌతమ్ అదానీపై అభియోగాలు చేసింది. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చింది. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది. ఆగస్టు 2021లో జగన్‌కు ముడుపులు ముట్టాయి. పవర్ సప్లైలో అదానీ జగన్‌ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారు’’ అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.
జగన్ మోదీకి దత్త పుత్రుడు
‘‘అదానీతో జగన్‌కు కొన్ని కీలక విషయాల్లో డిస్కస్ జరిగింది. జగన్ మోదీకి దత్త పుత్రుడు. ఆయన మీద విచారణ చేయిస్తారా. అదానీపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీనీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. ఒక సహచరిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.. అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ ... ఇలాంటివి నేను మాట్లాడకుంటే ఎలా’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
Updated Date - Nov 22 , 2024 | 01:08 PM