Share News

AP News: ఆ ప్రాంతాన్ని వదలని అక్రమ మైనింగ్ దందా

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:02 AM

ఏపీలోని కొన్ని జిల్లాలను పాత వాసనలు ఇంకా వదలడం లేదు. పాలన మారినా.. పాలకులు మారినా యథావిధిగా అక్రమ దందాను అయితే వైసీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ ప్రాంతంలో అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారు.

AP News: ఆ ప్రాంతాన్ని వదలని అక్రమ మైనింగ్ దందా

కడప: ఏపీలోని కొన్ని జిల్లాలను పాత వాసనలు ఇంకా వదలడం లేదు. పాలన మారినా.. పాలకులు మారినా యథావిధిగా అక్రమ దందాను అయితే వైసీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ ప్రాంతంలో అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అది ఇంకేదో జిల్లా కాదు.. మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ పులివెందుల. ఈ ప్రాంతంలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోంది. యంత్రాలతో కొండలను తవ్వి అక్రమంగా గ్రావెల్‌ను వైసీపీ నేతలు తరలిస్తున్నారు. పాత పద్ధతిలోనే అధికారులు పట్టించుకోవడం లేదు.


పాలకులు ఎవరు వచ్చినా.. ఎవరు పోయినా తాము మాత్రం మారేది లేదన్నట్టుగా ఉంది వైసీపీ నేతల వ్యవహారం. ఆ పార్టీ అధికారంలో ఉండగా అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగింది. పాలకుల అండతో కొండలకు కొండలనే తవ్వేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అక్రమ మైనింగ్ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

Chandrababu : ఏపీ నంబర్‌1

Read more AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 09:02 AM