Polavaram: పోలవరంపై మంత్రివర్గంలో కీలక చర్చ
ABN , Publish Date - Jul 25 , 2024 | 09:42 AM
పోలవరంపై మంత్రివర్గంలో కీలక చర్చ నడుస్తోంది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నిపుణుల కమిటీ నివేదిక అందించింది. డయాఫ్రమ్ వాల్‌కు దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక అందించింది.
అమరావతి: పోలవరం (Polavaram)పై మంత్రివర్గంలో కీలక చర్చ నడుస్తోంది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నిపుణుల కమిటీ నివేదిక అందించింది. డయాఫ్రమ్ వాల్‌కు దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక అందించింది. తరువాత భిన్నంగా వచ్చిన విదేశీ నిపుణులు నివేదిక అందించారు. డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా మరో దయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని నిపుణుల కమిటీ నివేదిక అందించింది. ఇదే అభిప్రాయంతో కేంద్ర జలవనరుల శాఖ (Central Water Resources Department) ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఈ రోజు కేబినెట్ లో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అంశమే సింగిల్ అజెండాగా కేబినెట్ జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం (Central Government) అంగీకారం తెలపడంతో ఏపీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కేంద్ర కేబినెట్ (Cabinet) ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో శరవేగంగా పనులు జరగనున్నాయి. కూటమి సర్కార్‌కు ఇదొక తియ్యటి కబురే అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు (CM Chandrababu) సర్కారుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫలించిన ప్రయత్నాలు..!
వైసీపీ (YSRCP) పాలనలో కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఇష్టానుసారం వాడేసి.. అసలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏ ఏ కీలక విషయాల్లో ఫెయిల్ అయ్యిందో.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వాటిపైనే ఫోకస్ పెట్టింది. తొలుత పోలవరంపైనే సీఎం నారా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం పోలవరం కోసమే కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాజాగా కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది.
పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్’
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra pradesh News and Latest Telugu News