Share News

ఇండియా జీఏపీ సర్టిఫికేషనతో వేరుశనగకు మంచి ధర

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:23 PM

ఇండియా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్యాకేజి( ఇండి జీఏపీ) సర్టిఫికెట్‌ పొందితే వేరుశనగకు మంచి ధర పలుకుతుం దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) చంద్రానాయక్‌ సూచించారు. బుధవారం మదన పల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారి పల్లె వద్ద పొలంబడి నిర్వహించారు

ఇండియా జీఏపీ సర్టిఫికేషనతో వేరుశనగకు మంచి ధర
వేరుశనగ పైరును పరిశీలిస్తున్న డీఏవో చంద్రానాయక్‌

మదనపల్లె టౌన, సెప్టెంబరు 4: ఇండియా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్యాకేజి( ఇండి జీఏపీ) సర్టిఫికెట్‌ పొందితే వేరుశనగకు మంచి ధర పలుకుతుం దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) చంద్రానాయక్‌ సూచించారు. బుధవారం మదన పల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారి పల్లె వద్ద పొలంబడి నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జీఏపీ సర్టిఫికేషన పొందిన పంటను మదనపల్లె పట్టణంలోని మ ర్యాద రామన్నపట్నం ఎఫ్‌పీవో ద్వారా కొనుగోలు చేస్తారన్నారు. వ్యవసాయంలో మెళకువలతో మంచి దిగుబడి వస్తుందన్నారు. పొలంబడిలో క్రమం తప్పకుండా రైతులు పంటలను పరిశీలిం చాలన్నారు. రుతువులను అనుసరించి వాతావరణంలో కలిగే మార్పులను గమనిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. మిత్ర పురుగులను సంరక్షించాల న్నారు. ఏవో నాగప్రసాద్‌, టెక్నికల్‌ ఏవోలు వెంకటమోహన, రమేశరాజు, ఎఫ్‌పీవో నిర్వాహకులు అమరేంద్ర, రైతులు పాల్గొన్నారు.

సాగు వివరాలు నమోదు చేయాలి

గుర్రంకొండ/కురుబలకోట: రైతులు సాగు చేసి న పైర్ల వివరాలను డీఏవో సూచించారు. గు ర్రంకొండ పంచాయతీ దౌలతఖానపల్లె, కురుబ ల కోట మండలం ముదివేడు సమీపంలో లో వేరుశనగ, పూల పైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే పంట నష్టపోయినప్పుడు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయశాఖ సిబ్బంది పంటల వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో ఏడీఏ శివశంకర్‌, ఏవోలు రాధ, నవీన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 11:23 PM