జీవజాతుల మనుగడకు మొక్కలే ఆధారం
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:03 PM
జీవరాశి మనుగడకు మొక్కలే ఆధారమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన మోహనరాజు తెలియజేశారు. శుక్రవారం అటవీశాఖ రేంజర్ ఆర్. నారాయణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎస్.ఆర్ పాలెం వద్ద నగరవనంలో వన మహోత్సవం ప్రారంభించారు.
రాజంపేట, ఆగస్టు 30 : జీవరాశి మనుగడకు మొక్కలే ఆధారమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన మోహనరాజు తెలియజేశారు. శుక్రవారం అటవీశాఖ రేంజర్ ఆర్. నారాయణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎస్.ఆర్ పాలెం వద్ద నగరవనంలో వన మహోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణీకరణలో భాగంగా వృక్షాల నరికివేతతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అతివృష్టి, అనావృష్టితో ప్రకృతి విలయతాండవం చేస్తోం దన్నారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరు మొ క్కలు నాటి వృక్ష జాతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజు విద్యాసంస్థల ఎనసీసీ స్కౌట్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన.సుధాకర్, రూరల్ సీఐ రామాంజనేయుడు, రాజంపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు, ఉపాధ్య క్షుడు సతీష్‌రాజు, టీడీపీ మాజీ అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు, కాకతీయ సేవాసంఘం అధ్యక్షుడు శివనారాయణ చౌదరి, సిద్దవటం జడ్పీటీసీ మాజీ సభ్యుడు చలమయ్యయాదవ్, బాకరాపేట సర్పంచ ప్రతాప్‌నాయుడు, తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమా నులు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక అన్నమా చార్య ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.స్వర్ణలత , వైస్ ఛైర్మన చొప్పా ఎల్లారెడ్డి, ఎనఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.ప్రదీప్‌కుమార్, కళాశాల ఫార్మకాగ్నెన్సీ విభాగం వారు మొక్కలు నాటించారు. చొప్పా గంగిరెడ్డి, చొప్పా అభిషేక్‌రెడ్డి, ఛైర్మన డాక్టర్ సి.రామచంద్రారెడ్డి అభినందించారు.
ఓబులవారిపల్లె: పచ్చదనం పరిఢవిల్లినప్పుడే ప్రకృతి పరవశించి వర్షాలు కురుస్తాయని, ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని రైల్వేకోడూరు శాసనసభ్యుడు అరవ శ్రీధర్ అన్నారు. వన మహోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని ముక్కావారిపల్లె పంచాయతీ సంజీవపురం గురుకుల పాఠశాలలో ఉపాధ్యా యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతాపం పెరుగుదలత్లో వాతావరణంలో వస్తున్నమార్పులు, మనుషులు జీవజాలంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అతివృష్టి, అనావృష్టికి కారణమవుతున్నాయని, పండుగ రోజుల్లో పుట్టినరోజు, పెళ్లి రోజులు విశేష జనాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, ఎన్డీయే కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సుండుపల్లి: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చెట్లునాటే కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇనచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రారంబించారు. ఎంపీపీ రాజమ్మ, ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దామోదర్ నాయుడు, శివ బాలయ్య, జనసేన మహిళా నాయకురాలు రెడ్డి రాణి, ఎస్‌ఓ శివ శృతి తదితరులు పాల్గోన్నారు.
చిట్వేలి: చిట్వేలి రేంజి పరిధిలోని రాజుకుంట పంచాయతీ అనుంపల్లిలో ఫారెస్ట్ డిపార్టుమెంట్ రేంజర్ ధీరజ్ అధికారులతో కలిసి ముక్కా సాయివికాస్‌రెడ్డి మొక్కలు నాటారు. పంచాయతీ సర్పంచ గుత్తి నరసింహా, బాలు రామాంజనేయులు, వెంకటేశరాజు, మాదాసు నరసింహా, కాకర్ల నాగార్జున, బాలకృష్ణయాదవ్, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, సావిత్రి, కేవీ సుబ్బయ్య, ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లె: స్థానిక అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఎంపీడీవో వెంకటరామిరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వృక్ష సంపదను కాపాడుకుంటే వర్షాలు సమృద్ధి గా కురుస్తాయన్నారు. ఏపీవో పెంచలయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా బంజరు భూమిలో మొక్కలు నాటుతామన్నారు. పొలాలగట్లల్లో మొక్కలు నాటాలన్నారు. ఎంఈఓ చక్రేనాయక్, పాఠ శాల ప్రిన్సిపాల్ పరిమళ, ఎస్‌ఐ రవీంద్రబాబు, రాజంపేట పార్లమెంట్ సెల్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి షఫినాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మదనమోహన మక్తార్, అరిపుల్లా, కావలి అంజనేయులు, నమ్రుద్దీన్ ,ఉపాధ్యాయులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వీరబల్లి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని డ్వామా ఇన్ చార్జి ఏపీడీ లక్ష్మినరసయ్య పిలుపునిచ్చారు. మట్లి పంచాయతీ చెత్తనుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. ఏపీఓ నాగరాజు,ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు
సంబేపల్లి: హరితాంధ్ర కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం అని ఎంపీడీవో సునీల్ కూమార్, ప్రధానోపాధ్యాయుడు నరసింహ రెడ్డి పిలుపునిచ్చారు. సంబేపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, రాయచోటి అంబేద్కర్ గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాల యాల్లో మొక్కలు నాటారు. ఇనచార్జ్ ప్రిన్సిపాల్ అరుణ, ఏపీవో రెడ్డి జోహర్, హౌసింగ్ ఏఈ శివ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.