ABN , First Publish Date - 2023-01-10T23:46:03+05:30 IST

డివిజన్‌ కేంద్రమైన టెక్కలికి బుధ, గురువారాల్లో కొళాయిల ద్వారా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మోహన్‌ మంగళ వారం తెలిపారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకానికి సంబంధించిన మెయిన్‌ పైప్‌లైన్‌ సోగ్గాడి పేట వద్ద లీకులకు గురికావడంతో బుధ, గురువారాల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు.

టెక్కలి: డివిజన్‌ కేంద్రమైన టెక్కలికి బుధ, గురువారాల్లో కొళాయిల ద్వారా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మోహన్‌ మంగళ వారం తెలిపారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకానికి సంబంధించిన మెయిన్‌ పైప్‌లైన్‌ సోగ్గాడి పేట వద్ద లీకులకు గురికావడంతో బుధ, గురువారాల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై ఈనెల 5న ‘తాగునీరు వృథా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. రెండు రోజులపాటు ప్రధాన పైప్‌ లైన్‌ మరమ్మ తులు చేపడుతున్నందున టెక్కలి పట్టణంతో పాటు చింతలగార, భగవాన్‌పురం, చల్ల పేట, శ్యామసుందరాపురం తదితర గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అయితే సంక్రాంతి పర్వదినాల సందర్భంగా నీటి సరఫరా నిలిపివేయనుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-01-10T23:46:04+05:30 IST