Lookout Notices: ఎంపీ విజయసాయి రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు
ABN , Publish Date - Dec 05 , 2024 | 09:49 AM
అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డిపై ఎల్వోసీ ఇచ్చింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy)పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ (Lookout notices) జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కుమారుడు విక్రాంత్ రెడ్డి (Vikranth Reddy), అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి (Sarath Chandra Reddy)పై ఎల్వోసీ (LOC) ఇచ్చింది. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యూలర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హాయంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరున్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందనేది ప్రధాన అభియోగం.
దీనిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి.. ఈ ముగ్గురు కీలక నిందితులుగా ఉన్నారు. కేవీ రావు స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. విక్రాంత్ రెడ్డిపై ఇప్పటికే సీఐడీ గురిపెట్టింది. కేవీ రావుతోపాటు మరికొందరి స్టేట్‌మెంట్లు కూడా రికార్డు చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. అధికారులు కేసు రిజిష్టర్ చేసిన వెంటనే లుకౌట్ నోటీసులుజారీ చేశారు. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వారిని విచారించేందుకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు
ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి
బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News