ISRO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..
ABN , Publish Date - Dec 04 , 2024 | 07:33 AM
ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ను నింగిలోనికి ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో టీం ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత వుంచి ఆశీస్సులు పొందారు.
తిరుమల: ఇస్రో (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం పిఎస్ఎల్వి సి 59 (PSLV-C59) రాకెట్ (Rocket)ను నింగిలోనికి ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో టీం ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత వుంచి ఆశీస్సులు పొందారు.
పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ప్రయోగం..
కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO).. బుధవారం సాయంత్రం 4.06 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం (SHAR) నుంచి పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ని ప్రయోగించనుంది. ఈ రాకెట్‌లో ప్రోబా-3 (Proba-3) మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు.
ప్రోబా-3 మిషన్
ప్రోబా-3 మిషన్ ఇండియాది కాదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. దీన్ని ఇన్-ఆర్బిట్ డెమొన్‌స్ట్రేషన్ మిషన్ అంటారు. ఈ ప్రయోగం ద్వారా 61వ పిఎస్ఎల్వి రాకెట్‌ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది. ప్రోబా-3 మిషన్‌లో భాగంగా 550 కేజీల శాటిలైట్లను అత్యంత ఎత్తులో ఉన్న ఎల్లిప్టికల్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది. ఇది భూమి నుంచి సుమారు 60 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పీఎస్ఎల్వీ సీ- 59 రాకెట్ ప్రయోగంకు సర్వం సిద్ధం
కాగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ను ప్రయోగిస్తున్నారు. ఈ మిషన్‌లో రెండు ఉపగ్రహాలను అమర్చారు. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ (సిఎస్సీ ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో ఏర్పాటు చేశారు. ఈ భూమి నుంచి సుమారు 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రయోగ విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 4.08 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెదిరించి, భయపెట్టి కొట్టేశారు
శ్రద్ధా ఇంటి రెంట్ ఎంతో తెలుసా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News