Kakani: మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:13 AM
అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా హైడ్రామాకు తెరతీశారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. కాగా అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) కాకాణి గోవర్ధన్ రెడ్ది (Kakani Govardhan Reddy) హైడ్రామా (Hydrama)కు తెరతీశారు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు ఫొస్టు చేస్తూ పోలీసులకు సవాళ్లు (Challenges for the police) విసురుతున్నారు. మరో వైపు కాకాణి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు. ఫోను ఒక ప్రాంతంలో ఉంచి, తాను మరో ప్రాంతంలో ఉంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ప్రస్తుతం కాకాణి హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు కాకాణి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు గురువారం నాటికి వాయిదా వేసింది. రేపటి (గురువారం) వరకు అరెస్ట్ కాకుండా ఆర్డర్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి కాకాణి ఫోన్లు చేస్తున్నాడు. కాగా మూడవసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి. గతంలోనూ ఓ కేసులో కాకాణి పరారై సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. అదే తరహాలో ఇప్పుడూ డ్రామాలు కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..: మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Govardhan Reddy) రెండో రోజు (మంగళవారం) కూడా విచారణకు గైర్హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద... కాకాణి విచారణకు వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు రెండో రోజు విచారణకు కూడా మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. బుధవారం రాత్రి కాకాణి నెల్లూరు చేరుకుంటానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని ఆయన చెప్పాడు.
కాగా మరోసారి కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. కాకాణి విచారణకు హాజరు కాకపోవడంతో డీఎస్పీ శ్రీనివాసరావు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కాకాణితో సహా ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. క్వార్ట్జ్ కేసులో అట్రాసిటీ యాక్ట్‌ను పోలీసులు యాడ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
మందు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
For More AP News and Telugu News