Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 29 , 2024 | 08:48 AM
జగన్ భారత పౌరుడిగా భావించకుంటే పాకిస్థాన్‌కు వెళ్లొచ్చునని, దేశానికి, హిందూ మతానికి, రాష్ట్రానికి ఆయన క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తల్లి, చెల్లినీ దూరంగా పెట్టిన జగన్‌నకు మతం, దేశం, రాష్ట్రంపై ఏమి గౌరవం ఉంటుందని మండిపడ్డారు.
నెల్లూరు: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy)పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ‘‘ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా.. ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోమిరెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని, ఆయనకు మతి చెలించి, మతిస్థిమితం కోల్పోయారని, మతాలు, దేశాల గురించి ప్రశ్నించే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఒళ్లు కొవ్వెక్కి దేశం గురించి మాట్లాడే స్థితికి జగన్ దిగజారారని దుయ్యబట్టారు. సౌదీ అరేబియాకో, దుబాయ్‌కో వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికైనా దేశానికీ, హిందువులకూ జగన్ క్షమాపణలు చెప్పి ఓ మూల కూర్చోవాలని సోమిరెడ్డి హితవుపలికారు.
అలా చేస్తే జగన్‌ను భారతి ఇంట్లోకి రానీయరా..
భారత పౌరుడిగా భావించకుంటే పాకిస్థాన్‌కు వెళ్లొచ్చునని, దేశానికి, హిందూ మతానికి, రాష్ట్రానికి జగన్ క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తల్లి, చెల్లినీ దూరంగా పెట్టిన జగన్‌నకు మతం, దేశం, రాష్ట్రంపై ఏమి గౌరవం ఉంటుందని అన్నారు. జగన్ తాను పుట్టిన రాయలసీమలోని తిరుపతికి పోలేకున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో, మిధున్ రెడ్డి రాజంపేటలో అడుగుపెట్టలేకున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నానీ, వల్లభనేని వంశీ, రోజా వారి జిల్లాలకు పోలేకపోతున్నారని, విజయసాయి రెడ్డి విశాఖకు వెళ్లలేరని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారన్నారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇస్తే, భారతి ఇంట్లోకి రానివ్వరేమో... సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయని, పెట్టకుంటే హిందువుల ఓట్లు పోతాయనే భయంలో జగన్ ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్‌ను దేశబహిష్కరణ చేయాలి.. మంత్రి గొట్టపాటి
అలాగే జగన్‌పై మంత్రి గొట్టపాటి రవికుమార్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలుంటాయని.. వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడవవుతావన్నారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ.. జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది, వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే దేశంలో ఉంటూ దేశ సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పేసరికి... ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశమన్నా... దేశ సంప్రదాయాలన్నా ఏమాత్రం గౌరవం లేదనే తన నైజాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్నారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరిచుస్తూ... భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి రవికుమార్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం
గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News