Sriharikota : ప్రయోగ వేదికకు పీఎస్‌ఎల్వీ-సీ60
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:34 AM
శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 30న ప్రయోగించనున్న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
30న స్పెడెక్స్‌తో నింగిలోకి పయనం
సూళ్లూరుపేట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 30న ప్రయోగించనున్న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్‌లో అనుసంధాన పనులు పూర్తి చేసుకొన్న రాకెట్‌ను షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ శనివారం ఉదయం 8 గంటలకు పచ్చజెండా ఊపి ప్రయోగ వేదిక వద్దనున్న మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎ్‌సటీ)కు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాకెట్‌ను నెమ్మదిగా 11 గంటలకు ఎంఎ్‌సటీ వద్దకు చేర్చారు. ఇక్కడ రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఈ రాకెట్ ద్వారా స్పెడెక్స్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. సాధారణంగా పిఫ్ భవనంలో రాకెట్ రెండు దశల వరకు అనుసంధానం చేసి ఎంఎ్‌సటీకి తరలిస్తారు. అక్కడ మూడు, నాలుగు దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తిచేస్తారు. అయితే ఈ ప్రయోగానికి తొలిసారిగా పిఫ్ భవనంలోనే పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ నాలుగు దశలను అనుసంఽధానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి, గ్రూపు డైరెక్టర్ గోపీకృష్ణ, శాస్త్రవేత్తల బృందం పాల్గొన్నారు.
ఈసాతో ఇస్రో ఒప్పందం
పరస్పర సహకారానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎ్‌సఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈసాకు చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో 5న విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఈసా, ఇస్రో ఒప్పందం మరింత బలపడింది. గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించి ట్రాకింట్ వంటి సాంకేతిక సహకారం అందించాలని యూరోపియన్ అంతరిక్ష కేంద్రాలను ఇస్రో కోరింది. ఈ మేరకు ఈసా డైరెక్టర్ జనరల్ డాక్టర్ జోసెప్ అస్‌బాచర్‌తో ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.