వైభవంగా కాటంరాజు గ్రామోత్సవం
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:33 PM
పెద్దారవీడు మండలంలోని గుండ్లంచర్ల గ్రామ శివారులో వెలసిన వేనూతల కాటంరాజు తిరునాళ్ల అత్యంత వైభవంగా నిర్వహించారు.

పెద్దారవీడు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుండ్లంచర్ల గ్రామ శివారులో వెలసిన వేనూతల కాటంరాజు తిరునాళ్ల అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లలలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల ఆశోక్‌రెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేనూతల కాటంరాజు, గంగాభవానీ అమ్మవార్ల గ్రామోత్సవంలో పల్లకి మోశారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభలపై మాట్లాడారు. చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసమే దివంగత నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని చెపారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసమే పీ4 విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. కాటంరాజు తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.