Share News

AP Free Sand policy: ఉచిత ఇసుక పాలసీపై విడుదల కానీ జీవో..

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:16 AM

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. దీంతో ఉదయం 6 గంటల నుంచి స్టాక్ పాయింట్స్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. అయితే ఇప్పటి వరకు ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడదల కానీ పరిస్థితి.

AP Free Sand policy: ఉచిత ఇసుక పాలసీపై  విడుదల కానీ జీవో..
Free Sand Policy

అమరావతి, జూలై 8: ఏపీ ప్రభుత్వం (AP Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ (Fress Sand Policy) విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. దీంతో ఉదయం 6 గంటల నుంచి స్టాక్ పాయింట్స్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. అయితే ఇప్పటి వరకు ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడదల కానీ పరిస్థితి. దీంతో ప్రభుత్వ జీవో కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..


ఆలస్యానికి కారణమిదే...

మరోవైపు.. ఉచిత ఇసుక వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. దీంతో వెంటనే జీవో విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరికొద్దిసేపట్లో జీవో వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యం అని కింద స్థాయి అధికారులు చెబుతున్నారు.


ఏర్పాట్లు పూర్తి...

కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. హామీల్లో ఒకటైన ఉచిత ఇసుక పాలసీ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో నేటి నుంచే ఉచిత ఇసుక పాలసీ అమలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నిల్వ ఉన్న ఇసుకను వినియోగదారులకు అందించనున్నారు. ఈ విధానంలో వినియోగదారులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని.. లేబర్‌, రవాణా చార్జీలనే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఆధార్‌ కార్డు మీద ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి మించి ఎక్కడా ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

BRS: బీఆర్‌ఎస్‌కు షాక్... సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్సీ


ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు...

ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు జరిగే లావాదేవీలు జరుగనున్నాయి. అలాగే ఇసుక అక్రమ మార్గాల్లో తరలకుండా ఎక్కడికక్కడ పోలీస్‌, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఎవరైతే వినియోగదారులు తమకు ఇసుక కావాలని, ముందుకొస్తారో వారంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎవరైతే ముందు చేశారో ఆ క్రమపద్ధతిలోనే స్టాక్‌ పాయింట్లో ఉన్న ఇసుకను అందించే ప్రయత్నం చేయనున్నారు. అంటే ముందుగా వస్తే ముందు వరుసలోనే అనే సూత్రాన్ని పాటించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 11:47 AM