Share News

Congress: జగన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం.. వివిధ పార్టీలతో షర్మిల సమావేశం ఉంటుందన్న గిడుగు

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:26 PM

సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లుగా పోరాడుతోందని ఆ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించిందని తెలిపారు.

Congress: జగన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం.. వివిధ పార్టీలతో షర్మిల సమావేశం ఉంటుందన్న గిడుగు

విజయవాడ: సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లుగా పోరాడుతోందని ఆ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించిందని తెలిపారు. "ప్రస్తుతం బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే మిత్రులు ఒకే వేదికపై ఉన్నారు. ప్రధాని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి అదానీ, అంబానీల కోసం పోరాటం చేస్తున్నారు. విభజన హామీల్లో ఒకటైన ఏపీకి ప్రత్యేక హోదాను నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఇందు కోసం పదేళ్లుగా అధికార బీజేపీతో పోరాటం చేస్తున్నాం.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పని చేస్తాం. ఫిబ్రవరి 23న రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో షర్మిల సమావేశం నిర్వహిస్తుంది" అని గిడుగు అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు రాజకీయ శక్తిగా ఎదగాలన్నారు. కమ్యూనిస్టులు అన్ని స్థానాల్లో పోటీ చేయలేవని.. అది తమ బలహీనత అని చెప్పారు. వైసీపీ పాలనలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని.. వాటికి సీపీఎం ఖండిస్తుందని స్పష్టం చేశారు. వామపక్ష పార్టీలు మాత్రమే మీడియాకు అండగా నిలబడతాయని తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 04:26 PM