ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:37 PM
తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె లో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా టీటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఆదివారం తో ముగిశాయి.
తంబళ్లపల్లె సెప్టెంబర్ 15 : తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె లో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా టీటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఆదివారం తో ముగిశాయి. ఈ పవిత్రోత్సవాల్లో టీడీపీ నేత జయచంద్రారెడ్డి ఆయన సతీమణి కల్పనరెడ్డి కూటమి నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ ఏవో వరలక్ష్మీ ఆలయ అధికారి దుష్యంత కుమార్ ఘన స్వాగతం పలికారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం చతుస్థానార్చనం, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపన తిరుమం జనం, చక్రస్నానం శాసోక్తంగా నిర్వహించారు. జయచంద్రారెడ్డి దంప తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూ.లు నిర్వ హించారు. ఆలయ అధికారులు, వేదపండితులు వారికి కూటమి నేతల కు తీర్థప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమ న్వయ కర్త సీడ్ మల్లిఖార్జున నాయుడు, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తుల సీదర్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, సిద్దమ్మ, తెలుగు యువత గంగరాజు, సోమశేఖర్, ఉత్మమ్‌రెడ్డి, వెంకటరెడ్డి, మద నమహనరెడ్డి, రేపన బాబు, ఆనంద్, తరుగు శివారెడ్డి, జయరాంరెడ్డి, బీఎంఆర్ రెడ్డెప్ప, స్వామిరెడ్డి, మూలపల్లె శేఖర, సురేంద్ర, సుధాకర్, వికలాంగుల అద్యక్షుడు రామాంజులు, మల్లీ, అశోక్, మధు పాల్గొన్నారు.