Share News

Pilli Manikyala Rao: లెదర్‌ పార్కు భూముల కబ్జాకు నాడు వైసీపీ కుట్రలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:58 AM

చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాడు ఉమ్మడి జిల్లాల్లో లెదర్‌ పార్కుల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లాలోని..

Pilli Manikyala Rao: లెదర్‌ పార్కు భూముల కబ్జాకు నాడు వైసీపీ కుట్రలు

చర్మకారులకు సహకార సంఘం: పిల్లి మాణిక్యాలరావు

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాడు ఉమ్మడి జిల్లాల్లో లెదర్‌ పార్కుల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లాలోని అడిగొప్పులలో 34.65 ఎకరాలు, విజయవాడలో రూ.100 కోట్ల విలువైన భూములను కేటాయిస్తే, వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పేరుతో బినామీల ముసుగులో కొట్టేసేందుకు యత్నించారని లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాల రావు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ భూముల్లో ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకూడదని, నిజమైన అర్హులు ఉంటే వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. చ ర్మకారులకోసం ప్రత్యేక కో-ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటుచేస్తామని చెప్పారు.

Updated Date - Mar 23 , 2025 | 04:59 AM