Share News

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Dec 16 , 2024 | 08:10 AM

మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ముటకట్టుకోవడంతో.. పార్టీలోని కీలక నేతలంతా దాదాపుగా రాజీనామా చేశారు.

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభలో సోమవారం ఉదయం 11.00 గంటలకు వారితో చైర్మన్ జగదీప్ దన్‍ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక ఇటీవల జరిగింది. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‍లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.


ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ముటకట్టుకోవడంతో.. పార్టీలోని కీలక నేతలంతా దాదాపుగా రాజీనామా చేశారు. ఆ క్రమంలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే కాకుండా... రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.


ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బరిలో దిగగా.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య బరిలో నిలిచారు. దాంతో ఈ ఉప ఎన్నికల్లో వీరి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇక ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావాలంటే.. 25 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. కానీ వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో అభ్యర్థిని బరిలో నిలిపినా.. గెలుపు సాధ్యం కాదన్న సంగతి అందరికి తెలిసిందే. మరోవైపు ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కొ స్థానానికి రాజ్యసభ ఎన్నిక జరిగింది.


ఈ ఉప ఎన్నిక జరిగిన రోజే.. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. బీసీల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా వెళ్తానని ఆయన ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం బీజేపీతోనే సాధ్యమవుతోందన్నారు. తాను ఏ పార్టీల వద్దకు వెళ్లడం లేదని.. పార్టీలే తన వద్దకు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 08:12 AM