Share News

ప్రేమికుల ఆత్మహత్య

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:16 AM

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ప్రేమికులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమికుల ఆత్మహత్య

  • ఆమె మైనర్‌

  • అతనికి అంతకుముందే వివాహం

  • బాలికను చేసుకునేందుకు నెల కిందట విడాకులు

  • వడ్లపూడిలో సంఘటన

కూర్మన్నపాలెం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ప్రేమికులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని వడ్లపూడిలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మర్రిపాలెం సమీప హర్షనగర్‌కు చెందిన అమీరుద్దీన్‌ఖాన్‌ (36) ఏడాదిగా సింహాచలం గోశాల వద్ద టిఫిన్‌ దుకాణం నడుపుతున్న పిన్నింటి జయశ్రీ వద్ద చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో జయశ్రీ కుమార్తె పిన్నింటి వెంకటదుర్గ(17)తో చనువుగా ఉండేవాడు. ఆమె స్థానిక కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తన కుమార్తెతో అమీరుద్దీన్‌ఖాన్‌ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతడిని జయశ్రీ పని నుంచి తొలగించింది. కాగా అమీరుద్దీన్‌కు గతంలోనే వివాహమైంది. అయితే జయశ్రీ కుమార్తెను పెళ్లి చేసుకునేందుకు వీలుగా నెల రోజుల కిందట విడాకులు తీసుకున్నాడు.

ఇదిలావుండగా జయశ్రీ తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తోంది. తాను ఇష్టపడిన అమీరుద్దీన్‌ఖాన్‌తో పెళ్లికి తల్లి అంగీకరించే ప్రసక్తి లేదని తెలుసుకున్న ఆమె శుక్రవారం ఉదయం తల్లి టిఫిన్‌ దుకాణానికి వెళ్లిపోయిన తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. దుకాణం నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన జయశ్రీకి...అక్కడ కుమార్తె కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని వాకబు చేసింది. చీరలు తెచ్చుకుంటానని బయటకు వెళ్లిందని వారు చెప్పడంతో అనుమానం వచ్చి అమీరుద్దీన్‌ఖాన్‌ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది.

అమీరుద్దీన్‌ఖాన్‌కు వడ్లపూడిలో స్నేహితుడు ఉన్నాడు. గత రెండు వారాలుగా అతడి వద్దకు వచ్చి వెళుతున్నాడు. శుక్రవారం అమీరుద్దీన్‌, బాలిక అక్కడకు వెళ్లారు. కుమార్తెను వెతుకుతూ జయశ్రీ వడ్లపూడిలోని అమీరుద్దీన్‌ఖాన్‌ స్నేహితుడికి ఇంటికి చేరింది. తలుపులు మూసి ఉండడంతో కిటికీలోంచి చూడగా, కుమార్తెతో పాటు అమీరుద్దీన్‌ ఫ్యాన్‌కు ఉరివ ేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి, కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:16 AM