రైతు సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే జయసూర్య
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:19 AM
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పాములపాడు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. క్రిష్ణానగర్, వేంపెంట, లింగాల, పాములపాడు, రుద్రవరం గ్రామాల ప్రజలు ఐదుగురికి సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ. 10,34,053 చెక్కులను అందించారు. క్రిష్ణానగర్ గ్రామ శివార్లలో ఇటీవల వీచిన ఈదురు గాలులకు నేలకొరిగిన వరి పంటలను పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 39 సీసీ రోడ్లు నిర్మించామని చెప్పారు. టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్రరెడ్డి, తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, చంద్రశేఖర్, లక్ష్మీకాంతరెడ్డి, రామసుబ్బమ్మ, కృష్ణ, ఆదిరెడ్డి, మోహన్‌గౌడ్, వినయ్, రాజేశ్, లెనిన్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
వేంపెంటలో హెల్త్ సబ్‌సెంటర్‌ను ఎమ్మెల్యే జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెల్త్ సెంటర్‌కు తాళం వేస్తూ ఎమ్మెల్యే కంటబడ్డారు. హెల్త్ అసిస్టెంట్ నారయణమ్మతో పాటు మరో ఇద్దరివి రిజిస్టర్‌లో 14వ తేదీ నుంచి సిబ్బంది సంతకాలు లేవని, ఐదుగురు సిబ్బందికి గానూ ఒక్కరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు తెలిపారు.