Share News

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN , Publish Date - Nov 07 , 2024 | 08:57 AM

వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు గురువారం కూడా కొనసాగనున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ బుధవారం సోదాలు నిర్వహించారు.

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే  ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

ప.గో. జిల్లా: భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే (YCP Ex MLA) గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) ఇంట్లో రెండవ రోజు గురువారం కూడా ఐటీ సోదాలు (IT Rides) కొనసాగనున్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ అధికారుల దాడులు కొనసాగాయి. కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంధి శ్రీనివాస్ పై జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేశారని, అవకతవకలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే ఐటి దాడులు నిర్వహించటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ బుధవారం ఉదయం ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి ఇంటికి చేరుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కీలక పత్రాలు లభ్యమైనట్టు సమాచారం. రొయ్యల వ్యాపారంలో గ్రంధి శ్రీనివాస్‌కు ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి. భీమవరంలోని ఇతర రొయ్యల వ్యాపారులతో లావాదేవీలు సాగించినట్టు కూడా రికార్డుల్లో ఉన్నట్టు తెలిసింది. గ్రంధి నివాసంలో ఐటీ సోదాలు జరగడం ఇది రెండోసారి. మూడు దశాబ్దాల క్రితం ఒకసారి తనిఖీలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేశారు.


ప్రకాశంలోని జీవీఆర్‌ కంపెనీలో

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సాగర్‌ గ్రంధి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీవీఆర్‌)లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇది గ్రంధి శ్రీనివాస్‌కు చెందిన రొయ్యల ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ. 11 మంది ఐటీ అధికారులు కంపెనీకి చెందిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సోదాల అనంతరం పలు కీలక రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

నాగాయలంకలో

కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి, గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపార భాగస్వామి చెన్ను లక్ష్మణరావు(సీఎల్‌ రావు) నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. తెలంగాణకు చెందిన 9 మంది ఐటీ అధికారులు.. ఆ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో నాగాయలంకలోని లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. లక్ష్మణరావుకు వక్కపట్లవారిపాలెంలో రొయ్యల కంపెనీ, అవనిగడ్డలో ఐస్‌ ఫ్యాక్టరీ ఉన్నాయి. అయితే, ఐటీ అధికారులు ఐదు చోట్ల సోదాలు చేసినట్లు సమాచారం. లక్ష్మణరావు 20 ఏళ్ల కిందటే నాగాయలంకకు వచ్చి రొయ్యల వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌తోనూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. లక్ష్మణరావు, గ్రంథి శ్రీనివాస్ భాగస్వామ్యంలో ఇటీవల రూ.75 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలిసింది. అయితే, దీనికి సంబంధించి ఆదాయ పన్నులు చెల్లించకపోవడంతో ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

ఫార్ములా-ఈ రేసింగ్‌‌పై ఏసీబీ దూకుడు..

బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు

నెల రోజుల్లో సెట్‌ చేస్తా

టార్గెట్‌ కేటీఆర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 07 , 2024 | 09:14 AM