Fake News: రోత ముఠా...ఫేక్ రాత!
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:16 AM
అంతా నీచమే! పేటీఎం ఫేక్ బతుకులే! విపక్ష నేతలపై బురదచల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ‘ఆంధ్రజ్యోతి’, ‘వే టు న్యూస్’ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం! ఇదే పాడు పద్ధతి! సొంత రోత మీడియాను నమ్మరనీ, దానికి విశ్వసనీయత లేదని వారికీ
పదేపదే ‘ఆంధ్రజ్యోతి’ లోగోతో ఫేక్ వార్తల సృష్టి
నీలి మీడియాకు విశ్వసనీయత లేదని ఒప్పుకొన్నట్లే!
పవన్‌కు నాలుగో భార్య అంటూ తప్పుడు కథనం
‘జెండా’ సభపైనా వైసీపీ ఫేక్ వీడియోలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అంతా నీచమే! పేటీఎం ఫేక్ బతుకులే! విపక్ష నేతలపై బురదచల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ‘ఆంధ్రజ్యోతి’, (Andhrajyothy) ‘వే టు న్యూస్’ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం! ఇదే పాడు పద్ధతి! సొంత రోత మీడియాను నమ్మరనీ, దానికి విశ్వసనీయత లేదని వారికీ తెలిసిపోయింది. అందుకే... నిజాలను నిక్కచ్చిగా రాసే ‘ఆంధ్రజ్యోతి’ పేరుతో ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. ‘కాలకేయుల్లా’ మారిన వైసీపీ (YSR Congress) సోషల్ మీడియా విభాగం ఇప్పటికే అన్ని విలువలను వదిలేసింది. తాజాగా... జనసేన అధిపతి పవన్ కల్యాణ్ నాలుగో భార్య అంటూ ఒక మహిళ పేరు తెరపైకి తెచ్చి, నానా నీచపు రాతలు రాసి, అదంతా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనట్లుగా ఒక పోస్టును సృష్టించారు. బుధవారం జరిగిన ‘జెండా’ సభలో సీఎం జగన్‌పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ‘జగన్ దృష్టిలో నేనంటే... రెండు విడాకులు, మూడు పెళ్లిళ్లు. నాలుగో పెళ్లి అని కూడా అంటున్నారు.
AP Elections 2024: చంద్రబాబుపై మళ్లీ ఫేక్ ప్రచారానికి తెగబడిన వైసీపీ!
నాలుగో భార్య ఎవరో... జగనేనేమో’ అంటూ ముఖ్యమంత్రికి చురకలు అంటించారు. దీంతో... వైసీపీ విలవిల్లాడిపోయింది. ఆ వెంటనే... పవన్ కల్యాణ్ నాలుగో భార్య అంటూ ఒక మహిళ ఫొటోతో తప్పుడు వార్త సృష్టించి, అది ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనట్లుగా ఫేక్ ప్రచారానికి తెరలేపారు. జగన్‌కు సొంత మీడియా సంస్థ ఉంది. రోత రాతలు రాసే పత్రిక ఉంది. వాళ్లు చెప్పింది, నమ్మింది నిజమైతే... ఆ మీడియాలోనే రాసుకోవచ్చు. లేదా... ఫేక్ వార్తలకు నీలి, కూలి మీడియా లోగోలు వాడుకోవచ్చు. కానీ... పనిగట్టుకుని పదేపదే ‘ఆంధ్రజ్యోతి’ పేరునే వాడుకుంటున్నారు. ‘ఆంధ్రజ్యోతి, ఈనాడు’ను జగన్ అన్ని సభల్లో స్మరించుకుంటుండగా... ఆయన సోషల్ మీడియా విభాగం ‘ఆంధ్రజ్యోతి’ని ఇలా వాడుకుంటోంది. అంటే... జగన్ సొంత మీడియాలో వచ్చిన వార్తలను ఎవరూ నమ్మరని, ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైందని చెబితేనే విశ్వసిస్తారని వారూ గ్రహించారన్న మాట!
AP Elections: ‘ఫ్యాను’ పార్టీ పాడుపని.. చీ.. ఛీ.. ఇంత దిగజారాలా జగన్..?
సభ జరుగుతుండగానే...
తాడేపల్లిగూడెం వద్ద బుధవారం టీడీపీ-జనసేన ఉమ్మడి సభ ముగియక ముందే వైసీపీ సోషల్ మీడియా ఫేక్ దాడి మొదలుపెట్టింది. వాయిస్ మార్ఫింగ్, తప్పుడు పత్రికా ప్రకటనలతో ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నించింది. ‘టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్. వైసీపీ చీటింగ్ టీమ్’ అని చంద్రబాబు పేర్కొనగా... దీనికి రివర్స్‌లో అన్నట్లుగా వాయిస్ మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పొత్తులో 24 సీట్లను ఎందుకు తీసుకున్నామో పవన్ కల్యాణ్ ‘జెండా’ సభలో వివరంగా చెప్పారు. కానీ... ‘నా నిర్ణయంతో ఏకీభవించకపోతే వైసీపీలో చేరిపోండి’ అని జనసేన శ్రేణులపై పవన్ మండిపడినట్లుగా నీలి ముఠా సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రకటనను విడుదల చేసింది. దీనిపై టీడీపీ, జనసేన వెంటనే అప్రమత్తమయ్యాయి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దంటూ అప్పటికప్పుడు ప్రజలకు సూచించాయి.