AP Election 2024: ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ.. ప్రచారం కోసం భారీ ప్లాన్
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:45 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) సమీపిస్తుండటంతో వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈసారి కూడా అధికారంలోకి ఎలాగైనా రావడానికి అధికార పార్టీ పలు అడ్డదారులు తొక్కుతోంది. ఇదే అదునుగా ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక్కటై ప్రజలనూ ప్రలోభాలకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈసారి కూడా అధికారంలోకి ఎలాగైనా రావడానికి జగన్ పార్టీ పలు అడ్డదారులు తొక్కుతోంది. ఇదే అదునుగా ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక్కటై ప్రజలనూ ప్రలోభాలకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు.
ఇళ్ల పట్టాల పేరుతో భారీ కుట్ర...
ప్లాన్‌లో భాగంగానే రెవెన్యూ అధికారులతో అధికార వైసీపీ నేతలు ప్రచారానికి తెరదీశారు. అనుకున్నదే తడవుగా అధికార వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు కూడా స్వామిభక్తి చాటుతున్నారు. సీఎం జగన్, కీలక నేతలను ప్రసన్నం చేసుకోడానికి తెగ ఆరాటపడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో ఉన్నత పదవులు పొందడమే లక్ష్యంగా కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో మరోసారి ఊదరగొట్టేందుకు వైసీపీ భారీ కుట్రకు తెరలేపింది. ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొత్తం 30 లక్షల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా.. అందులో నామమాత్రంగా 8 లక్షలు మాత్రమే పంపిణీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందు ఆర్భాటంగా మరోసారి కొత్త నాటకానికి తెరదీసింది. ఇందులో భాగంగానే మిగతా 22 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇళ్ల పట్టాల పత్రాలపై నవరత్నాల లోగో, జగన్ బొమ్మ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?
ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి
రానున్న రోజుల్లో పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈనెల మే 13వ తేదీలోగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడమేకాక రెవెన్యూ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నేడు జరుగనున్న స్క్రీనింగ్ కమిటీకి ఈ ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ఈ స్క్రీనింగ్ కమిటీకి చీఫ్ సెక్రటరీ అధ్యక్షత వహించనున్నారు. స్క్రీనింగ్ కమిటీలో ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ నుంచి ప్రభుత్వ అధికారులు చేసిన ప్రతిపాదనను ఎన్నికల కమిషన్‌కు పంపాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సీఎం జగన్ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో వారు ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలని కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా లెక్క చేయని కొంతమంది రెవెన్యూ ఉన్నతాధికారులు బాహాటంగానే బరితెగింపులకు దిగారు. ఇండ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికార వైసీపీ ప్రచారానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే జగనన్న సేవలో తరించేందుకు ఉన్నతాధికారులు తాపత్రాయపడుతున్నట్లు సమాచారం.
AP elections: విశాఖ సౌత్‌లో నెగ్గేదెవరు..?
మరిన్ని ఏపీ వార్తల కోసం...