Share News

జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌లో చూపిన మొత్తాన్ని చెల్లించకుంటే..?

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:13 AM

జీఎ్‌సటీలో రిటర్న్‌ దాఖలు చేసే ప్రక్రియ మొదట జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌తో ప్రారంభమవుతుందనే విషయం తెలిసిందే. ఒక నెలలో జరిపిన అమ్మకాలు లేదా సరఫరాల తాలుకు వివరాలు, అంటే సరఫరాల విలువ...

జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌లో చూపిన మొత్తాన్ని చెల్లించకుంటే..?

జీఎ్‌సటీలో రిటర్న్‌ దాఖలు చేసే ప్రక్రియ మొదట జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌తో ప్రారంభమవుతుందనే విషయం తెలిసిందే. ఒక నెలలో జరిపిన అమ్మకాలు లేదా సరఫరాల తాలుకు వివరాలు, అంటే సరఫరాల విలువ, ఇన్వాయి్‌సల వివరాలు, పన్ను శాతం, కట్టవలసిన పన్ను, ఇంకా క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్‌ వివరాలతో పాటు కొనుగోలుదారుల జీఎస్‌టీ వివరాలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే జీఎస్‌టీఆర్‌-1లో చూపిన వివరాల ప్రకారమే అవతలి వ్యక్తి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే జీఎ్‌సటీఆర్‌-1 అతి ముఖ్యమైన రిటర్న్‌. ఇందులో చూపిన పన్ను అనేది స్వయంగా మదింపు చేసిన పన్ను. దీనినే ‘సెల్ఫ్‌ అసెస్డ్‌ ట్యాక్స్‌’ అంటారు. కానీ, ఈ రిటర్న్‌ ద్వారా పన్ను చెల్లించే సౌలభ్యం లేదు. ఈ రిటర్న్‌లో చూపిన మొత్తాన్ని జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్న్‌ ద్వారా చెల్లించాలి. అందుకే, ఏదేనీ నెలకు లేదా పీరియడ్‌కు సంబంధించి జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్న్‌ ద్వారా కట్టిన పన్ను వివరాలు జీఎ్‌సటీఆర్‌-1లో చూపిన పన్ను వివరాలతో సరిపోవాలి. సాధారణంగా కట్టాల్సిన పన్ను కంటే తక్కువ కడితే, చట్ట ప్రకారం నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. కానీ, జీఎ్‌సటీఆర్‌-1లో చూపిన పన్ను కంటే జీఎ్‌సటీఆర్‌-3బీ ద్వారా కట్టిన పన్ను తక్కువగా ఉంటే ఎలాంటి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేకుండా రికవరీ చర్యలకు ఉపక్రమించే అధికారం అధికారులకు ఉంది. ఎందుకంటే ఇది వ్యాపారి తాను స్వయంగా మదింపు చేసిన పన్ను కాబట్టి.


అయితే ఇలా పన్ను తక్కువ కట్టటానికి కొన్ని సందర్భాల్లో సరైన కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు ముందు నెలలో ఎక్కువ పన్ను కట్టి ఉండవచ్చు. ఆ మేరకు ఈ నెలలో తగ్గించి ఉండవచ్చు. పన్ను తక్కువ కట్టటానికి గల కారణాలను తెలుసుకోకుండా తగు చర్యలు తీసుకుంటే పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంతో ప్రభుత్వం కొత్తగా ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనినే డీఆర్‌సీ-01 బీ అంటారు. ఎప్పుడైతే, జీఎ్‌సటీఆర్‌-1లో చూపిన పన్ను కంటే జీఎ్‌సటీఆర్‌-3బీ ద్వారా కట్టిన పన్ను తక్కువగా ఉందో, అప్పు డు తగు వివరణ కోరుతూ సదరు వ్యాపారికి ఈ డీఆర్‌సీ -01 బీ జారీ చేస్తారు. ఇది జీఎ్‌సటీ కామన్‌ పోర్టల్‌ ద్వారా జారీ చేయబడుతుంది. అంతేకాకుండా సంబంధిత వ్యాపారి, జీఎ్‌సటీలో ఇచ్చిన ఈ-మెయిల్‌కు కూడా పంపబడుతుంది.


ఈ డీఆర్‌సీ-01 బీ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది పార్ట్‌-ఏ, ఇందులో జీఎ్‌సటీఆర్‌-1లో చూపిన పన్ను వివరాలు, జీఎ్‌సటీఆర్‌-3బీ ద్వారా కట్టిన పన్ను వివరాలు, ఎంత తక్కువ కట్టారు మొదలైన వివరాలు ఉంటాయి. తక్కువ కట్టిన పన్నును ఈ నోటీస్‌ అందుకున్న వారంలోపు వడ్డీతో సహా డీఆర్‌సీ-03లో కట్టాలి. ఆ వివరాలను పార్ట్‌-బీలో చూపాలి. లేదా పన్ను తక్కువ కట్టటానికి తగు కారణాలు ఉంటే, ఆ వివరాలను కూడా పార్ట్‌-బీలో చూపవచ్చు. లేదా రెండు కలిపి చూపవచ్చు. ఇలా వారం రోజుల లోపు వడ్డీతో సహా పన్ను కట్టటం లేదా వివరణ ఇవ్వటం జరగాలి. పన్ను కట్టకున్నా, వివరణ ఇవ్వకున్నా లేదా ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా లేకున్నా పైన చెప్పిన నోటీస్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా రికవరీ చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది. కాబట్టి జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్న్‌ వేసేటప్పుడు సంబంధిత వివరాలను జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌తో ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. సరైన కారణాలు ఉంటే తప్ప జీఎ్‌సటీఆర్‌-1లో చూపిన దాని కంటే తక్కువ పన్ను కట్టకూడదు.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - Jun 09 , 2024 | 03:13 AM