Share News

Toll Charges Increase: వాహనదారులకు గుడ్ న్యూస్..ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల తగ్గింపు

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:31 PM

దేశంలో వాహనదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరమైన ఏప్రిల్ 1, 2025 నుంచి టోల్ ఛార్జీలను పెంచనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే ఈ ధరలు పలు ప్రాంతాల్లో పెరుగగా, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గడం విశేషం.

Toll Charges Increase: వాహనదారులకు గుడ్ న్యూస్..ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల తగ్గింపు
Toll Charges Increase

దేశంలో వాహనదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్‌వే లేదా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు టోల్ ఛార్జీలను పెంచారు. అయితే కొత్త రేట్లు కొన్ని ప్రాంతాల్లో వృద్ధి చెందగా, మరికొన్ని చోట్లు తగ్గాయి. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది. ఈ రేట్ల మార్పులు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలు అవుతాయి. ఈ క్రమంలో ప్రయాణం మొదలు పెట్టే ముందు వాహనదారులు ఈ కొత్త రేట్ల గురించి ముందుగా తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఈ టోల్ ఛార్జీల పెంపు వల్ల దేశవ్యాప్తంగా అనేక టోల్ ప్లాజాలలో ప్రయాణిస్తున్న వాహనదారులపై ప్రభావం పడనుంది.


ఏప్రిల్ 1, 2025 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అమలులోకి రానున్న టోల్ ఛార్జీలు

ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలను కలిపే జాతీయ రహదారి 65 వెంబడి ఉన్న పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1, 2025 నుంచి అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలు తగ్గిపోనున్నాయి.

పంతంగి టోల్ ప్లాజా

  • పంతంగి టోల్ ప్లాజా (హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో) కార్లు, జీపులు, వ్యాన్లు: సింగిల్ జ‌ర్నీ: రూ. 80 (ముందు రూ.95), రిటర్న్ జ‌ర్నీ: రూ.115 (ముందు రూ.145)

  • తేలికపాటి వాణిజ్య వాహనాలు, మినీ బస్సులు: సింగిల్ జ‌ర్నీ: రూ.125 (ముందు రూ.150), రిటర్న్ జ‌ర్నీ: రూ.190 (ముందు రూ.230)

  • బస్సులు, రెండు యాక్సిల్ ట్రక్కులు: సింగిల్ జ‌ర్నీ: రూ.265 (ముందు రూ.315), రిటర్న్ జ‌ర్నీ: రూ.395 (ముందు రూ.470)

  • మూడు యాక్సిల్ వాహనాలు: సింగిల్ జ‌ర్నీ: రూ. 290 (ముందు రూ. 485), రిటర్న్ జ‌ర్నీ: రూ.435 (ముందు రూ.725)


కొర్లపహాడ్ టోల్ ప్లాజా

  • కొర్లపహాడ్ టోల్ ప్లాజా (హైదరాబాద్ నుంచి 118 కిలోమీటర్ల దూరంలో) కార్లు, జీపులు, వ్యాన్లు: సింగిల్ జ‌ర్నీ: రూ.120 (ముందు రూ.130), రిటర్న్ జ‌ర్నీ: రూ.180 (ముందు రూ.195)

  • తేలికపాటి వాణిజ్య వాహనాలు, మినీ బస్సులు: సింగిల్ జ‌ర్నీ: రూ.195 (ముందు రూ.205), రిటర్న్ జ‌ర్నీ: రూ.295 (ముందు రూ.310)

  • బస్సులు, ట్రక్కులు: సింగిల్ జ‌ర్నీ: రూ.410 (ముందు రూ.430), రిటర్న్ జ‌ర్నీ: రూ.615 (ముందు రూ.640)

  • మూడు యాక్సిల్ వాహనాలు: సింగిల్ జ‌ర్నీ: రూ.450 (ముందు రూ.665), రిటర్న్ జ‌ర్నీ: రూ.675 (ముందు రూ.995)


చిల్లకల్లు టోల్ ప్లాజా

  • చిల్లకల్లు టోల్ ప్లాజా (విజయవాడ నుంచి 205 కిలోమీటర్ల దూరం) కార్లు, జీపులు, వ్యాన్లు: సింగిల్ జ‌ర్నీ: రూ.105 (ముందు రూ.110), రిటర్న్ జ‌ర్నీ: రూ.155 (ముందు రూ.160)

  • తేలికపాటి వాణిజ్య వాహనాలు, మినీ బస్సులు: సింగిల్ జ‌ర్నీ: రూ.165 (ముందు రూ.110), రిటర్న్ జ‌ర్నీ: రూ.250 (ముందు రూ.160)

  • బస్సులు, ట్రక్కులు: సింగిల్ జ‌ర్నీ: రూ.350 (ముందు రూ.355), రిటర్న్ జ‌ర్నీ: రూ.520 (ముందు రూ.530)

  • మూడు యాక్సిల్ వాహనాలు: సింగిల్ జ‌ర్నీ: రూ.380 (ముందు రూ.545), రిటర్న్ జ‌ర్నీ: రూ.570 (ముందు రూ.820)

  • ఈ సవరణలు మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటాయి.


ఏప్రిల్ 1 నుంచి ORRపై పెరిగిన టోల్ ఛార్జీలు

మరోవైపు ఏప్రిల్ 1, 2025 నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ప్రయాణించే వాహనదారులు కూడా కొత్తగా పెరిగిన టోల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. IRB ఇన్ఫ్రా సంస్థ అమలు చేసిన ఈ పెంపు, టోల్ వసూలు ఒప్పందంలోని వార్షిక సర్దుబాటు నిబంధనల ప్రకారం అమలు చేయనుంది.

కొత్త టోల్ రేట్లు:

  • కార్లు, జీపులు, తేలికపాటి వాహనాలు: కొత్త ఛార్జీ: రూ.2.44/కి.మీ, పెరిగిన ధర రాష్ట్రంలో రూ.2.34 నుంచి రూ.2.44 వరకు

  • మినీ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు (LCVలు): కొత్త ఛార్జీ: రూ.3.94/కి.మీ, పెరిగిన ధర రాష్ట్రంలో రూ.3.77 నుంచి రూ.3.94 వరకు

  • టూ-యాక్సిల్ బస్సులు, ట్రక్కులు: కొత్త ఛార్జీ: రూ.7/కి.మీ, పెరిగిన ధర రాష్ట్రంలో రూ.6.69 నుంచి రూ. 7.00 వరకు

  • భారీ వాహనాలు: కొత్త ఛార్జీ: రూ.15.78/కి.మీ, పెరిగిన ధర రాష్ట్రంలో రూ.5.09 నుంచి రూ. 15.78 వరకు

  • ప్రత్యేకంగా, ఈ లెక్కలు సమీపంలో ఉన్న రూ.10కి రౌండ్ చేయబడతాయి.


ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9 లలో ప్రయాణించే వాహనదారుల ఈ భారం పడనుంది. సారాయ్ కాలే ఖాన్ నుంచి మీరట్ వరకు కారు/జీపు టోల్ రూ.165 నుంచి రూ.170కి పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలకు టోల్ రూ.275 కాగా, ట్రక్కులకు రూ.580 చెల్లించాల్సి ఉంటుంది.

ఛిజార్సి టోల్ ప్లాజా వద్ద కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కార్ల టోల్ రూ.170 నుంచి రూ.175కి పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.280కి చేరుకున్నాయి. బస్సు/ట్రక్ వాహనాలు ఇప్పుడు రూ.590 చెల్లించాలి. 7 లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు కలిగిన భారీ వాహనాలకు గరిష్ట టోల్ రుసం రూ.590కు పెరిగింది. ఘజియాబాద్ నుంచి మీరట్ వరకు ప్రయాణించే వాహనదారులు రూ.70కి బదులుగా రూ.75 టోల్ చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..


Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 31 , 2025 | 03:50 PM