Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..
ABN , Publish Date - Dec 30 , 2024 | 09:49 AM
జనవరి 1, 2025 నుంచి చాలా ముఖ్యమైన మార్పులు అమలు కానున్నాయి. ఇవి సామాన్యుడి నుంచి కంపెనీల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. అయితే ఆ మార్పులు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
2025 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అనేక మార్పులు జరగబోతున్నాయి. వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అమలు కానున్న మార్పులు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసేలా ఉంటాయి. ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ద్వారా మీకు, మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆ కొత్త మార్పులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1. పన్నులు, సబ్సిడీలలో మార్పులు
మొదటగా పన్నులకు వస్తున్న కొత్త మార్పుల గురించి చూద్దాం. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ గల లగ్జరీ వస్తువులపై 1% TCS పన్ను వచ్చే జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇది హ్యాండ్‌బ్యాగ్‌లు, వాచీలు వంటి వస్తువులను ప్రాముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. అలాగే సబ్సిడీ పథకాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారనున్నాయి.
2. UPI చెల్లింపు కొత్త పరిధి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త సంవత్సరంలో UPI 123Pay పరిమితిని పెంచింది. ఇప్పటి వరకు మీరు ఈ చెల్లింపు సేవను ఉపయోగించి రూ. 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే ఇక నుంచి ఈ పరిమితిని రూ.10వేలకు పెంచారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు.
3. పాత ఫోన్లలో WhatsApp సపోర్ట్ బంద్
సాంకేతికత కూడా చాలా వేగంగా మారనుంది. కొన్ని పాత స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ 2025 నుంచి ఆగిపోతుంది. వాస్తవానికి Samsung Galaxy S3, Motorola Moto G (1st Gen), HTC One, Sony Xperia Z వంటి ఈ పాత మోడళ్లలో కొనసాగుతుంది. కాబట్టి మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
4. రియల్ ఎస్టేట్‌లో భారీ పెరుగుదల
రియల్ ఎస్టేట్ రంగంలో పాజిటివ్ మార్పులు జరుగుతున్నాయి. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాప్‌టీ ధరలు గత 6 సంవత్సరాలలో 66% పెరిగాయి. ఈ పరిణామాలు ప్రాపర్టీ మార్కెట్‌ను మరింత ఉత్ప్రేరకం చేస్తాయి. వాటి విలువ కూడా అధికమవుతుంది. రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లో 55%, బెంగళూరులో గుంజూర్‌లో 69%, ముంబైలో పన్వెల్‌లో 58%, పూణేలో వాఘోలీలో 37% పెరుగుతున్నాయి.
5. మెరుగైన కనెక్టివిటీ
ఇప్పుడు ఆస్తిలకు డిమాండ్ పెరుగుతున్నది. నగరాల పరిధీ ప్రాంతాలలో ఉత్తమ కనెక్టివిటీ, పచ్చటి వాతావరణం వంటి అంశాలు, ప్రాపర్టీ ధరల పెరుగుదలకి కారణమవుతున్నాయి. మంచి వాతావరణంలో నివసించడం, ఆరోగ్యాన్ని, జీవనశైలిని మరింత మెరుగుపరుస్తుంది.
6. EPFOపై పెద్ద ఉపశమనం
కొత్త సంవత్సరంలో EPFO పెన్షన్ హోల్డర్లకు మంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ హోల్డర్లు ఇప్పుడు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా ఎటువంటి అదనపు ధృవీకరణ అవసరం లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.
7. ఇ-వే బిల్లుల విషయంలో..
ఇ-వే బిల్లులు (EWBలు) 180 రోజుల కంటే పాత పత్రాల కోసం మాత్రమే సృష్టించబడతాయి. మీ ఇన్‌వాయిస్, లాజిస్టిక్‌లు ఈ 180 రోజుల నియమాన్ని అనుసరిస్తున్నాయని నిర్ధారించుకోండి. EWBల కోసం రిమైండర్‌లను సెటప్ చేసుకోండి. ఇన్వెంటరీని నిర్వహించడానికి ఆయా బృందంతో సమన్వయం చేసుకోవాలి.
చివరగా..
2025 నుంచి జరుగుతున్న ఈ మార్పులు మీ జీవితాలనూ, ఆర్థిక స్థితిని క్రమంగా మార్చగలవు. అందువల్ల ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం చాలా అవసరం. దీంతోపాటు మరిన్ని విషయాలు ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News