ఇండియా ఇన్‌వాల్వ్‌డ్ ర్యాంకింగ్‌లో రిలయన్స్ టాప్
ABN , Publish Date - Apr 24 , 2024 | 06:15 AM
వికసిత్ భారత్ లక్ష్యాలపై భారత కార్పొరేట్ రంగం నిబద్ధతను మదించే ఇండియా ఇన్‌వాల్వ్‌డ్ ర్యాంకింగ్‌లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది...
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యాలపై భారత కార్పొరేట్ రంగం నిబద్ధతను మదించే ఇండియా ఇన్‌వాల్వ్‌డ్ ర్యాంకింగ్‌లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక- ఆర్థిక సమస్యలు, సమ్మిళిత వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించిన దేశీయ మేధోమదన సంస్థ స్కోచ్ గత ఏడాదికి గాను ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. 231 అంశాలపై పలు కంపెనీలను ఆరు నెలల పాటు అధ్యయనం చేసి టాప్ 20 కంపెనీలకు ర్యాంకింగ్స్ కేటాయించినట్లు స్కోచ్ తెలిపింది. మరిన్ని విషయాలు..
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), అదానీ గ్రూప్.. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
‘ఇండియా ఇన్‌వాల్వ్‌డ్ ర్యాంకింగ్ ఇన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’లో జియో ప్లాట్‌ఫామ్స్‌దే అగ్రస్థానం. లూపిన్, హెరిటేజ్ ఫుడ్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఈఎ్‌సజీ (పర్యావరణ, సామాజిక, పరిపాలన) ర్యాంకింగ్స్‌లో హెచ్‌యూఎల్, అదానీ గ్రూప్, బ్రిటానియా వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
కార్పొరేట్ ఎక్సలెన్స్ ర్యాంకింగ్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత స్థానాలు లభించాయి.