TCS: వర్క్ ఫ్రం హోం ముగిసినట్లే.. కరోనా పూర్వ స్థితికి టీసీఎస్
ABN , Publish Date - Jul 15 , 2024 | 06:37 AM
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
ముంబయి: కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
ఆఫీసులకు వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య, కరోనా ముందు స్థాయికి చేరుకుందని తెలిపారు. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారి సంఖ్యను పరిశీలించడాన్ని ఆపేసినట్లు చెప్పారు. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు వెల్లడించారు.
6 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్న ఈ కంపెనీలో, వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు ఇంటి నుంచి పని చేసే ఉద్యోగుల ట్రాకింగ్ ఉండదని తెలిపారు. వారంలో 5 రోజులు ఆఫీసుల నుంచి పని చేసే ఉద్యోగుల సంఖ్య 70 శాతానికి పైగా ఉందని వెల్లడించారు.
2024 జూన్ నాటికి టీసీఎస్‌లో మహిళా ఉద్యోగులు 35.5 శాతం ఉన్నారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. కరోనా దశ ముగియడంతో కంపెనీలు ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి.
For Latest News and National News click here