Lakshmana fruit: క్యాన్సర్‌కు దివ్యౌషధం ఈ పండు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:37 AM
Lakshmana fruit: ప్రకృతిలో అతి తక్కువ మందికి తెలిసిన పండ్లు చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి లక్ష్మణఫలం.. దీనినే హనుమాన్ ఫలం అని కూడా అంటారు. మన భారతదేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండును అధికంగా పండిస్తారు. లక్ష్మణ ఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటంతో వీటిని తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

క్యాన్సర్ పేరువింటేనే ప్రజలు భయపడి పోతున్నారు. ఇటీవల క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధిపై వైద్యులు ఎన్నో రకాల పరీక్షలు చేస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పండు క్యాన్సర్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది ఈ పండు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ పండులో పోషకాలెన్నో..
ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పండ్లు మన ఆరోగ్యానికి చాలా వరం. ప్రధానంగా లక్ష్మణఫలం లేదా హనుమాన్ ఫలం మనకు దొరికే అద్భుతాల్లో ఒకటి. ఈ పండు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన ఆయుధం. ఈ పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని చుట్టూ చిన్న చిన్న ముళ్లు ఉంటాయి. బయటి నుంచి గట్టిగా ఉంటుంది. కానీ లోపల మృదువుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండు ఆకులు, విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణంతక వ్యాధులతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
గుండె పోటు రాకుండా..
దక్షిణ అమెరికాలో సాంపద్రాయ వైద్యంలో భాగమైన ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతో ప్రసిద్ధి. క్యాన్సర్‌తో పోరాడటం నుంచి గుండె పోటును నివారించడం వరకు ఈ ఫలంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని రుచి స్ట్రాబెరీ, అరటి పండ్ల మిశ్రమంలా ఉంటుంది. పోషకాల విషయానికి వస్తే కప్పు లక్ష్మణఫలంలో 148 కేలరీలు, 7.42 గ్రాముల ఫైబర్, 37.8 గ్రాముల కార్బోహైడ్రైట్లు ఉంటాయి. ఈ పండులో విటమిన్ సీ, కాలుష్యం, పోటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైకోమిక్స్ ఉన్నందున మధుమేహంతో ఇబ్బంది పడే రోగులకు కూడా ఎంతో ప్రయోజనకరం. వీటితో పాటు కడుపునొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి లక్ష్మణఫలాన్ని ఉపయోగిస్తారు.
క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర..
క్యాన్సర్‌పై పోరాటడంలో లక్ష్మణఫలం కీలక పాత్ర పోషిస్తుంది. లాక్టోబాసిలస్‌లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్‌లోని కణాలను నాశనం చేయడంలో కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఓ సైంటిఫిక్ రిపోర్టు అధ్యాయన ప్రకారం ప్రోస్టేట్ క్యాన్సర్‌లపై లక్ష్మణఫలం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2024 సమీక్షలో క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని గుర్తించారు. దీనిలోని అసిటోసీజన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతాయి. అయితే ఈ లక్ష్మణఫలం ద్వారా కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. 2022 అధ్యాయన ప్రకారం అధిక స్థాయిలో అసిటోసీజన్లు తీసుకుంటే శరీరం విషపూరితం, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రభావాన్ని పెంచుతుంది. ఈ పండ్లను మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ లక్ష్మణఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనర్థాల బారిన పడే ప్రమాదం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..
వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి