Share News

Krishnashtami: కృష్ణాష్టమి రోజు ఈ పనులు అస్సలు చేయకండి

ABN , Publish Date - Aug 26 , 2024 | 08:11 AM

దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. ఉదయాన్నే స్నానాలాచరించి కుటుంబ సమేతంగా పూజలు జరుపుతున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదంట..

Krishnashtami: కృష్ణాష్టమి రోజు ఈ పనులు అస్సలు చేయకండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. భక్తులంతా ఉదయాన్నే స్నానాలాచరించి కుటుంబ సమేతంగా పూజలు చేస్తున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.. ఇంతకీ ఏమేం చేయకూడదు..? అనే విషయాలు తెలుసుకుందాం రండి..

  • ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

  • ఇతరులతో కఠినంగా ప్రవర్తించకూడదు. అందరితో మర్యాదగా మాట్లాడాలి.

  • గోవులపై దయతో వ్యవహరించాలి. జంతువులకు ఆహార, పానీయాలు అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుంది.

  • కృష్ణ జన్మాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క.

  • చెట్లను కూడా నరకొద్దు.ఇలా చేస్తే అశుభం కలిగే ప్రమాదం ఉంది.


  • కృష్ణాష్టమి రోజు మాంసం, మద్యం తీసుకోకూడదు. శాఖాహారమే తినాలి.

  • భాగస్వామితో ప్రేమానురాగాలకు దూరంగా ఉండాలి.

  • జంతువులకు హాని కలిగించకూడదు.

  • ఎవరిపై కోప్పడకూడదు, ఎవ్వరినీ అగౌరపరచకూడదు.

పూజ ఇలా చేయండి..

శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి విగ్రహానికి పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. గోపాలుడిని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండి నీళ్లతో కన్నయ్య పాదాల ముద్రలు వేయాలి. 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించి 'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:' అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. గోవర్ధనధారికి ఇష్టమైన వెన్న, పండ్లు, పాలు, వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజించేటప్పుడు కృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక, వేణువు, వెన్న వంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. గోమాత విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఇంటిని అందంగా అలంకరించుకోవాలి.

For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 08:56 AM