Dasara Navaratri 2024: నవరాత్రులు మూడో రోజు.. విశేషమేమంటే..
ABN , Publish Date - Oct 04 , 2024 | 06:06 PM
నవరాత్రుల్లో ముచ్చటగా మూడోరోజు.. అంటే శనివారం అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. దుర్గమ్మ తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో.. రెండో రోజు వేద మాత శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ముచ్చటగా మూడోరోజు.. అంటే శనివారం అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ.
సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. అన్నం.. జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు స్పష్టం చేశారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. అన్నపూర్ణదేవిని పూజిస్తే.. ఆకలిదప్పులు లాంటి బాధలు ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..
Also Read: Dussehra 2024: ఇంతకీ దసరా ఎప్పుడు.. అక్టోబర్ 12 లేదా 13 ? పండగ ఏ రోజు జరుపుకోవాలి..?
అమ్మ ధరించిన రస పాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని వివరిస్తున్నారు. అన్నపూర్ణ దేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలని వారు విశదీకరించి చెబుతున్నారు. అలాగే అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించే దుర్గమ్మకు ఈ రోజు మినప గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెట్టాలంటున్నారు. ఈ రోజు అమ్మవారిని పూజించే క్రమంలో అన్నపూర్ణాష్టంతో కొలిస్తే.. శుభ ఫలితాలుంటాయని వారు వివరిస్తున్నారు.
Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..
Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ !
అన్నపూర్ణాష్టకం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1
నానా రత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3
కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ |
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విఙ్ఞానదీపాంకురీ |
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5
ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరీ |
స్వర్గద్వారకవాట, పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ, సదా శుభకరీ, కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7
దేవీ సర్వ విచిత్రరత్నరచితా దాక్షాయిణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8
చంద్రార్కానల కోటికోటి సదృశా, చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తకపాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
ఙ్ఞానవైరాగ్య సిద్ద్యర్థం బిక్షాం దేహిచ పార్వతి |
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
భాందవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం || 11
ఇతి శ్రీ అన్నపూర్ణాష్టకం
Read More Devotional News and Latest Telugu News