Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత
ABN , Publish Date - May 11 , 2024 | 11:22 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే సమయం ఉండటంతో ప్రచారం నేటి సాయంత్రానికి ముగియనుంంది. అరవై రోజుల పాటు పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రతి ఏరియాలోనూ మైకుల మోత మోగింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే సమయం ఉండటంతో ప్రచారం నేటి సాయంత్రానికి ముగియనుంంది. అరవై రోజుల పాటు పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రతి ఏరియాలోనూ మైకుల మోత మోగింది. నేటి సాయంత్రంతో మైకులు సైతం మూగబోనున్నాయి. ఇక ఇప్పుడు ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కొన్ని గంటల పాటు డబ్బు, మద్యం ఏరులై పారుతుందనేది ఓపెన్ సీక్రెట్. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది.
Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
ఏపీకి గుట్టుగా నగదును తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళుతున్న వ్యాన్.. వెనుక నుంచి ఓ లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ వ్యాన్ అడుగు భాగంలో పోలీసులు డబ్బుతో ఉన్న నాలుగు బాక్సులను గుర్తించారు. ఇక తాజాగా రూ.2 కోట్ల విలువైన మద్యాన్ని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. బాలానగర్ జడ్చర్ల సమీపంలో పట్టుకున్నారు. దీని విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనంలో 800 కేసుల లిక్కర్ ఉండంతో వాహనాన్ని సీజ్ చేసి.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో మద్యాన్ని భారీగా పట్టుకున్నారు. అక్రమంగా వస్తున్న మద్యం ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉందన్న దానిపై విచారణ జరుగుతోంది.
ఇదికూడా చదవండి: Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
Read Latest Telangana News and National News