Kiren Rijiju: వక్ఫ్ సవరణ బిల్లు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:43 PM
Kiren Rijiju: కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలుపై కేంద్ర మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అలాగే ఈ బిల్లులో సవరణ ద్వారా ఏం తీసుకు వస్తుందని ఈ సభ వేదికగా ఆయన వివరించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02: కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లును సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఈ వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై తప్పు దొవ పట్టించే ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. ఈ బిల్లు సవరణలు సమర్పించడానికి ఒక ఏడాది ముందు, 2023లో జరిగిన పార్లమెంటరీ కమిటీ నాలుగు సమావేశాలు జరిగాయని.. వాటిలో దేనిలోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని రంజన్ గొగోయ్ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పై విధంగా స్పందించారు.
అలాగే కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 1970 నుండి ఢిల్లీలో జరుగుతున్న ఒక కేసులో పార్లమెంట్ భవనంతో సహా అనేక ఆస్తులు ఉన్నాయన్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసింది.. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు. కానీ అప్పుడు యుపిఎ 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు. అయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టకుంటే.. పార్లమెంట్ భూమి సైతం వక్ఫ్ ఆస్తి అనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వక్ఫ్ చట్టంలోని పలు క్రూరంగా పరిగణించే అంశాలను తమ ప్రభుత్వం తొలగించిందన్నారు. అంతేకాకుండా.. దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాలతోపాటు హర్యానాలోని వివిధ గురుద్వార్‌లను ముస్లిం సమాజం వక్ఫ్ భూమిగా క్లయిమ్ చేసిందని రిజిజు ఈ సందర్భంగా వివరించారు. అయితే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదంటూ.. ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి రిజిజు చురకలంటించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు నడుం బిగించాయని మండిపడ్డారు.
ఇక ఈ వక్ఫ్ బోర్డు విషయంతో తాము క్లియర్‌గా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలో కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌లలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండాలని నిర్ణయించామన్నారు. అలాగే ఈ వక్ఫ్ బోర్డులల్లో ముస్లిం మహిళలకు చోటు ఉండడం లేదని తెలిపారు. దీంతో ఈ బోర్డుల్లో ఇద్దరు ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు.
మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయని.. ఆ రాష్ట్రంలో 17 శాతం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. అందుకోసమే ఈ బిల్లును తీసుకు వస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News