Health Tips: ఈ ఆహారాలను వండిన మరుసటి రోజుకు పోషకాలు మరింత పెరుగుతాయ్..!
ABN , Publish Date - May 31 , 2024 | 01:05 PM
ఆహారాన్ని వండిన తరువాత గంట, రెండు గంటలలో తినడం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. దీనికి తగినట్టే చాలామంది వేడి వేడి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. ఆహారం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ అందులో పోషకాలు మెల్లిగా తగ్గుతాయి. అయితే విచిత్రంగా కొన్ని ఆహారాలలో మాత్రం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ పోషకాలు పెరుగుతాయి.

ఆహారాన్ని వండిన తరువాత గంట, రెండు గంటలలో తినడం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. దీనికి తగినట్టే చాలామంది వేడి వేడి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. ఆహారం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ అందులో పోషకాలు మెల్లిగా తగ్గుతాయి. అయితే విచిత్రంగా కొన్ని ఆహారాలలో మాత్రం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ పోషకాలు పెరుగుతాయి. వండిన మరుసటి రోజుకు పోషకాలు పెరిగే ఆహారాలేంటో తెలుసుకుంటే..
అన్నం..
అన్నాన్ని వండిన మరుసటి రోజుకు పోషకాలు పెరుగుతాయి. నిరోధక కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. ఇది గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది.
మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!
చిక్కుళ్లు..
నానబెట్టి ఉడికించిన చిక్కుళ్లు రాత్రిమొత్తం అలాగే ఉంచడం వల్ల వాటిలో యాంటీన్యూట్రియెంట్లు తగ్గుతాయి. ప్రోటీన్లు, ఖనిజాల లభ్యత పెరుగుతుంది.
కిమ్చి..
కిమ్చి అనేది మన ఊరగాయ లాంటిది. దీన్ని రాత్రిపూట తయారుచేసి ఉంచితే ప్రోబయోటిక్ లను అభివృద్ది చేస్తుంది. జీర్ణవ్యవస్థకు, గట్ ఆరోగ్యానికి మంచిది.
రొట్టెలు..
రొట్టెలు రాత్రిపూట చేసి మరుసటి రోజు తినడం ఆరోగ్యానకి చాలా మంచిది. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలు సులభంగా గ్రహించేలా చేస్తుంది.
ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.