walking: నడక వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుందా? రోజూ 4వేల అడుగులు నడిస్తే జరిగేదేంటంటే..!
ABN , First Publish Date - 2024-02-06T10:06:58+05:30 IST
చాలామంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తుంటారు. కానీ రోజూ 4వేల అడుగులు నడిస్తే మెదడులో జరిగే మార్పులివే..
నడక గొప్ప వ్యాయామం. ఇది ఎలాంటి పరికరాలు లేకుండానే అందరూ వాకింగ్ చేయవచ్చు. సాధారణంగా నడక వల్ల శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని అంటుంటారు. కానీ నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందనే షాకింగ్ విషయం ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. మరీ ముఖ్యంగా రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల మెదడులో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. రోజూ 4వేల అడుగులు నడిస్తే కలిగే లాభాలేంటో ఓ లుక్కేస్తే..
ఒత్తిడి తగ్గుతుంది..
రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి సహజమైన మూడ్ లిఫ్టర్లు. ఒత్తిడి, టెన్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారి జీవితంలో ఒత్తిడి నుండి బయటపడటానికి రోజూ 4వేల అడుగులు వేయడం చేలా మంచిది.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!
మానసిక స్థితి..
నడక వల్ల సెరోటోనిన్ స్థాయి మెరుగవుతుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించే సామర్థ్యం కలిగున్న న్యూరోట్రాన్స్మీటర్. క్రమం తప్పకుండా 4వేల అడుగులు నడుస్తుంటే మొత్తం మానసిక పరిస్థితి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
అభిజ్ఞా పనితీరు..
మెరుగైన జ్ఞాపకశక్తికి, అబిజ్ఞాపనితీరుకు నడక చాలా సహాయపడుతుంది. నడక వల్ల శరీరానికి కలిగే శారీరకశ్రమ కారణంగా మెదడుకు రక్తప్రవాహం పెరుగి న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది అభిజ్ఞా సామర్థ్యాన్ని పెంచుతుంది.
మెరుగైన నిద్ర..
రోజూ క్రమం తప్పకుండా 4వేల అడుగులు నడవడం వల్ల నిద్ర మీద సానుకూల ఫలితాలు ఉంటాయి. నడక వల్ల నిద్రగడియారం సమతుల్యంగా ఉంటుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి: Kitchen tips: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. గ్యాస్ స్టవ్ బర్నర్స్ కొత్తవాటిలా మెరుస్తాయి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.