Share News

Traffic Police: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:02 PM

Traffic Police: క్రిస్మస్ పండగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన 50 వాహనదారులకు చలాన్లు విధించారు.

 Traffic Police: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు
The items seized by the Patna Police.

పాట్నా, డిసెంబర్ 27: బిహార్ రాజధాని పాట్నాలో రూల్స్ అతిక్రమించిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పాట్నా నగరంలో క్రిస్మన్ పండగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనాల నేమ్ ప్లేట్‌పై బిహార్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని రాసి ఉన్న అనధికార వాహనాలతోపాటు అనుమతి లేకుండా మెటాలిక్ నెంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నవాహనాలకు భారీగా జరిమానా విధించారు.

తద్వారా ప్రభుత్వానికి రూ. 28 లక్షల ఆదాయం సమకూరింది. ఈ తనిఖీలు కేవలం పాట్నా నగరంలోని మెరైని డ్రైవ్, బయిలే రోడ్డు, జేపీ గంగా పాత్ ప్రాంతాల్లో మాత్రమే చేపట్టామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రత్యేక తనిఖీలు ఇంకా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగరంలోని ఇతర పాంత్రాల్లో సైతం ఈ తనిఖీలను విస్తరిస్తామన్నారు. జస్ట్ 50 కార్లను మాత్రమే తనిఖీ చేశామని వివరించారు. '


Patna.jpg

అయితే ఈ కార్లకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బిహార్, బిహార్ పోలీస్ అని నెంబర్ ప్లేట్ల మీద రాసి ఉందని తెలిపారు. ఇక ఈ ప్రత్యేక తనిఖీల్లో ఎర్ర బుగ్గ లైట్లు, ప్రభుత్వ నేమ్ ప్లేట్ల ఉన్న వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతోన్న ఆరుగురు వ్యక్తులపై కేసులు సైతం నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

Also Read: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది


దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీఐపీ సంస్కృతి నెలకొంది. వీఐపీలు ప్రయాణిస్తున్నారంటే.. పోలీసులు సైతం ట్రాఫిక్‌ను వెంటనే నియంత్రించి వారి.. వాహనాలను పంపిస్తారు. అలాగే ప్రభుత్వ వాహనం అంటే.. ట్రాఫిక్ పోలీసులు సైతం చలానాలు రాయరు. ఈ విషయాన్ని గ్రహించిన బిహార్‌ రాజధాని పాట్నా వాసులు తమ వాహనాలకు ఎర్ర బుగ్గ (Red Light)లను సైతం అమర్చారు.


అలాగే కారు విండో గ్లాసులకు నలుపు రంగు కవర్ అమరుస్తున్నారు. అదే విధంగా వాహనాల నెంబర్ ప్లేట్ల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బిహార్, బిహార్ పోలీస్ అని రాసి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ఈ తనిఖీలు చేపట్టాలని బిహార్ పోలీసులు నిర్ణయించారు. అందులోభాగంగా క్రిస్మస్ పండగ వేళ.. ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఆ క్రమంలో 50 వాహనాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి.. తిరుగుతున్నట్లు గుర్తించి.. వాటికి భారీగా చలాన్లు పోలీసులు విధించారు.


దీంతో ప్రభుత్వానికి రూ. 28 లక్షల ఆదాయం సకూరినట్లు అయింది. ఇక పాట్నా నగరం మొత్తం ఈ తరహా తనిఖీలు నిర్వహిస్తే మరింత మంది వాహనదారులు.. ట్రాఫిక్స్ రూల్స్ అతిక్రమించిన విషయం బహిర్గతమవుతోందనే వాదన వినిపిస్తోంది. అదే విధంగా బిహార్ రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా తనిఖీలు చేపడితే.. మాత్రం పరిస్థితి మరోలా ఉండే అవకాశముందని ఓ చర్చ సైతం ఆ బిహార్ ప్రజల్లో కొనసాగుతోంది.

For National News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 04:18 PM