Sivaji statue collapse: శివాజీ విగ్రహం కూలిపోవడంపై అజిత్ పవార్ క్షమాపణ
ABN , Publish Date - Aug 28 , 2024 | 07:45 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సింధుదుర్గ్‌లో ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్షమాపణ తెలిపారు. శివాజీ తమ దైవమని, విగ్రహం కూలిపోవడం దురదృష్టకరమని అన్నారు.
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సింధుదుర్గ్‌లో ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) క్షమాపణ తెలిపారు. ''శివాజీ మహరాజ్ మా దైవం. ఆయన విగ్రహం కూలిపోవడంపై 13 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు నేను క్షమాపణలు తెలుపుతున్నారు. దోషులపై చర్చలు తీసుకుంటాం. విగ్రహం ఏర్పాటు చేసిన ఏడాలోనే కుప్పకూలడం దిగ్భ్రాంతికి గురిచేసింది'' అని తెలిపారు.
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భద్రత పెంపు
అదే స్థానంలో మరో భారీ విగ్రహం
కాగా, ఈ ఘటన దురదృష్టకరమని మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఎవరూ రాజకీయ కోణంలో చూడదరాదన్నారు. విగ్రహం కుప్పకూలడం అందరికీ ఆవేదన కలిగించే విషయమని, ఘటనను సరైన కోణంలో విచారణ జరిపించి బాధ్యులపై చర్చతీసుకుంటామని చెప్పారు. విగ్రహం కూలిపోయిన ప్రదేశంలో మరో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడరాదని కోరారు. సీనియర్ నేతగా శరద్ పవార్‌కు అన్నీ తెలుసునని, ఈ విగ్రహాన్ని నేవీ ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కాదని, అయితే అవినీతి ఎక్కడ జరిగినా అది తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
గత ఏడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న రాజ్‌కోట్ ఫోర్ట్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని నేవీ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలింది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Read More National News and Latest Telugu News