Share News

Akhilesh Yadav: యోగి అధికారిక నివాసం కింద 'శివలింగం'

ABN , Publish Date - Dec 30 , 2024 | 05:21 PM

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.

Akhilesh Yadav: యోగి అధికారిక నివాసం కింద 'శివలింగం'

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అధికారిక నివాస కింద 'శివలింగం' (Shivling) ఉందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొఘలుల కాలం నాటి మసీదు రీసర్వే సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడం, అదే జిల్లాలో ఇటీవల తవ్వకాల్లో పురాతన ఆలయాలు, బావులు వెలుగుచూడటంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చేశారు.

Manmohan Singh Death: వియత్నాంలో న్యూఇయర్ వేడుకలకు రాహుల్... బీజేపీ విమర్శ


భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు. ''ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం కింద శివలింగం ఉన్నట్టు మేము నమ్ముతున్నాం. అక్కడ కూడా తవ్వకాలు జరపాలి'' అని పేరొన్నారు. అమాయక ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని ఆరోపించారు. ఇదెంత మాత్రం అభివృద్ధి కాదని, విధ్వంసమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అనే ఆలోచన సీఎంకు లేదని, విధ్వంసం ఆలోచన మాత్రమే ఉందని ఆరోపించారు.


బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. సంభాల్‌లో తవ్వకాల వల్ల ఆయనకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించింది. 2013లో అఖిలేష్ 1,000 టన్నుల బంగారం తవ్వకాల కోసం రాష్ట్ర యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుందని బీజేపీ ప్రతినిధి రాకేష్ త్రిపాఠి గుర్తుచేశారు. బంగారం తవ్వకాల కోసం సిద్ధమైన వ్యక్తికి శివలింగంతో మాత్రం సమస్య ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి నివాసాన్ని తవ్వాలంటూ మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శివలింగాన్ని పరిహసించడం ఏమిటని బీజేపీ మరో ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.


కాగా, సంభాల్ జిల్లా కోట్ పూర్విలో గతవారం జరిగిన తవ్వకాల్లో బయటపడిన ''మృత్యు కూప్'' (వెల్ ఆఫ్ డెత్)ను పునరుద్ధరించే పనులు అధికారులు చేపట్టారు. ఈ బావి ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ బావికి చారిత్రక నేపథ్యం ఉందని, ఈ నీటితో స్నానం చేస్తే ముక్తి లభిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉండేదని చెబుతున్నారు. మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదు రీసర్వే సందర్భంగా గత నెలలో ఘర్షణలు చెలరేగి నలుగురు మృతిచెందారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతంలో కొత్త పోలీస్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి:

Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్

Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 30 , 2024 | 05:30 PM