Share News

Kishtwar: హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఆర్మీ జేసీఓ మృతి, ముగ్గురి జవాన్లకు గాయాలు

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:14 PM

అధికారిక సమాచారం ప్రకారం, గత గురువారం సాయంత్రం ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు హతమార్చినప్పటి నుంచి కుంత్వారా, కేష్వాన్ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేశ్వాస్-కిష్ట్వార్ మధ్య టెర్రరిస్టులకు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది

Kishtwar: హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఆర్మీ జేసీఓ మృతి, ముగ్గురి జవాన్లకు గాయాలు

కిష్ట్వార్: జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ (Kishtwar) జిల్లాలో ఆదివారంనాడు ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ స్పెషల్ ఫోర్స్ జూనియర్ కమిషన్డ్ అధికారి (JCO) ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దీంతో బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి.

Canada arrest: ఖలిస్తాన్ టెర్రరిస్టు అర్ష్ డల్లా కెనడాలో అరెస్టు


టెర్రరిస్టులను చుట్టుముట్టిన బలగాలు

అధికారిక సమాచారం ప్రకారం, గత గురువారం సాయంత్రం ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు హతమార్చినప్పటి నుంచి కుంత్వారా, కేష్వాన్ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేశ్వాస్-కిష్ట్వార్ మధ్య టెర్రరిస్టులకు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరు గ్రామస్థులను పొట్టనపెట్టుకున్న ఘటనలో ఈ గ్రూప్ ప్రమేయమున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు, బలగాల మధ్య హోరాహోరా కాల్పులు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయని అధికారులు తెలిపారు.


విలేజ్ డిఫెన్స్ గార్డుల హత్యోదంతం

కిష్ట్వార్‌లో గురువారంనాడు ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు హతమార్చారు. ఆ ఇద్దరినీ నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌గా గుర్తించారు. ఈ హత్యలు తామే చేశామని ఉగ్ర సంస్థ 'కశ్మీర్ టైగర్స్' ప్రకటించుకుంది. గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన నజీర్, కుల్దీప్‌ కుమారులు తిరిగిరాకపోవడంతో గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆ ఇద్దర్నీ తామే హతమార్చినట్టు కశ్మీర్ టైగర్స్ గ్రూప్ ప్రకటించడంతో బలగాలు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు చేపట్టాయి.


ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 08:14 PM