Haryana Politcs: ఆమె అడుగు పెట్టడంతోనే కాంగ్రెస్‌కు ఓటమి.. వినేష్ ఫోగట్‌పై బ్రిజ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:50 PM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యే, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటే కారణమని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంఢీగఢ్: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యే, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటే కారణమని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినేష్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశమనమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్‌లో ఉండటమే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని పేర్కొన్నారు. "వో జహా జహా జాయేగీ, సత్యనాష్ హోగా (ఆమె ఎక్కడికి వెళ్లినా విధ్వంసమే)" అని విమర్శించారు.
తన పేరు వాడుకుని వినేష్ జులానా సీటు నుంచి గెలుపొందారని, అందుకే తాను గొప్ప వ్యక్తినని పేర్కొన్నారు. "చాలా మంది BJP అభ్యర్థులు 'జాట్' జనాభా అత్యధికంగా ఉన్న స్థానాల్లో గెలిచారు. ఆందోళనలు చేసిన రెజ్లర్లు హరియాణాకు చెందిన హీరోలు కాదు. జూనియర్ రెజ్లర్లందరికీ కూడా వారు విలన్‌లే. వినేష్ గెలవడానికి నా పేరు వాడుకున్నారు. అందుకు నేను కారణమంటే నాకంటే గొప్ప వ్యక్తి ఎవరు. కానీ ఆమె గెలిచిం కాంగ్రెస్‌ను ఓడించింది" అని బ్రిజ్ భూషణ్ అన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వినేష్ గెలిచిన కొన్ని గంటల తరువాత బ్రిజ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వినేష్ ఫోగట్, తోటి రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్.. వినేష్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
వివాదమిదే..
గతేడాది వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే చీఫ్‌గా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్.. లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డారని.. రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇక వినేష్ ఫోగట్ సహా అగ్రస్థాయి రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీతోపాటు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు బీజేపీ తరఫున ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై చర్యలకు పోలీసులు, ప్రభుత్వాలు వెనుకాడటంతో కోర్టులను ఆశ్రయించగా.. ఆయనపై కేసులు నమోదు చేయాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఆయనను డబ్లూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయనపై కేసులు విచారణ దశలో ఉన్నాయి.